తెలంగాణ కేంద్రంగా మోదీ మార్క్ నిర్ణయాలు, గేమ్ షురూ..!!
తెలంగాణ వేదికగా కొత్త రాజకీయ లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. బెంగాల్ లో బీజేపీ అధికారం లోకి రావటంతో.. ఇక నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది. పంజాబ్.. తెలంగాణ పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. ఇందు కోసం పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ తెలంగాణ కు వస్తున్నారు. హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన నుంచి తెలంగాణ లో కొత్త లెక్కలు మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు పార్టీకి దిశా నిర్దేశం అందుతోంది. దీంతో.. ఈ పర్యటన తో మొదలయ్యే కొత్త రాజకీయం పైన బీజేపీ నాయకులు కీలక ప్రకటనలు చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీలో కొత్త అంచనాలు మొదలయ్యాయి. గత పర్యటన సమయం లోనే ప్రధాని మోదీ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. తెలంగాణలో అధికారం దిశగా అడుగులు ఉండాలని స్పష్టం చేసారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల నుంచే బీజేపీ కొత్త లెక్కలతో వ్యూహాల అమలుకు సిద్దం అవుతోంది. మోదీ పర్యటన సమయంలో పార్టీ నేతలతోనూ చర్చించే అవకాశం ఉంది. దీంతో.. 2028 ఎన్నికలే లక్ష్యంగా వేస్తున్న తొలి అడుగుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన సమయంలో ప్రధాని మోదీ దాదాపు రూ 9,400 కోట్ల విలువైన డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విధంగా పేరెడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ తెలంగాణ కేంద్రంగా తీసుకొనే నిర్ణయాలు.. తెలంగాణకు కేంద్రం నుంచి మద్దతు పైనా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ పై స్పెషల్ ఫోకస్
కాగా, ప్రధాని మోదీని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవనున్నారు. వినతి పత్రాన్ని సమర్పించ నున్నారు. ప్రధానంగా మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన పనులకు అనుమతులతో పాటు నిధులను కూడా కేటాయించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని కోరనున్నారు. మెట్రో రైలు విస్తరణ విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి ఎంతో అవసరమని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాకుండా, ప్రజా రవాణా వ్యవస్థ పెరిగి వాయు కాలుష్యం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించనున్నారు. మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనలను పంపి నెలలు గడుస్తున్నప్పటికీ స్పందన లేదని, నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కోరనున్నారు. ఇక.. పార్టీ ముఖ్య నేతలకు ప్రధాని ప్రత్యేకంగా సమయం ఇవ్వటంతో పాటుగా పార్టీ అంశాల పైన చర్చిస్తారని చెబుతున్నారు. దీంతో.. ఇక 2028 లక్ష్యంగా బీజేపీ నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications