చంద్రబాబుతో కోమటిరెడ్డి భేటీ..! హోదాపై జగన్ కు కీలక సూచన..!
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'కు రావాలని చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. చంద్రబాబుతో భేటీ అనంతరం బయటికి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపక్ష నేత హోదాపై స్పందించారు. దాంతో పాటే ఆయనకు ఓ కీలక సలహా కూడా ఇచ్చారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోమటిరెడ్డి కోరారు. ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి .. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025'ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నారని ఆయన చంద్రబాబుకు వివరించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబుతో భేటీ తర్వాత బయటికి వచ్చిన కోమటిరెడ్డి జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడంపై స్పందించారు. జగన్ కి ప్రతిపక్ష హోదా ముఖ్యo కాదని ఆయన తేల్చేసారు. జగన్ అది వదిలి అసెంబ్లీకి వచ్చి కూర్చోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై వచ్చి పోరాడాలన్నారు.హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్తాము అని జగన్ అనడం కరెక్ట్ కాదన్నారు.తెలంగాణ లాగా ఏపీ అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

జగన్ కు, ఆయన తండ్రి వైఎస్సార్ కు కూడా సన్నిహితుడైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విపక్ష నేత హోదా అడిగిన జగన్ ప్రభుత్వం దాన్ని నిరాకరించేసరికి అసెంబ్లీకి వెళ్లకుండా దూరంగా ఉండిపోతున్నారు. దానికి బదులు ప్రెస్ మీట్లు పెట్టి తన వాదన వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన సూచనను జగన్ పాటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications