వారంతా ఓట్లు కుమ్మేశారు.. ఏపీలో అధికారం ఆ పార్టీదే!
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన మహా సంగ్రామం ముగిసింది. జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒకటోతేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. వీటినిబట్టి ఒక అంచనాకు రావచ్చని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా 82 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ శాతం పెరిగిందా? లేదంటే వ్యతిరేకంగా పెరిగిందా? అనే విషయం అంతు చిక్కకుండా ఉంది. ఇదంతా పాజిటివ్ ఓటు అని వైసీపీ చెబుతుండగా, వ్యతిరేక ఓటు అని టీడీపీ చెబుతోంది.
మొదటి స్థానంలో శ్రీకాకుళం
ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి తమ ఓటుహక్కును భారీగా వినియోగించుకున్నారు. 5,39,189 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 38,865 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 25,283 ఓట్లతో నంద్యాల రెండో స్థానంలో నిలవగా 24,918 ఓట్లతో కడప జిల్లా మూడోస్థానంలో నిలిచింది.

అతి తక్కువగా నరసాపురంలో 15,320 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. జిల్లాల్లో కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటిది. అటువంటి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓటు హక్కును వినియోగించుకున్నారంటే కచ్చితంగా ప్రజలంతా టీడీపీవైపే మొగ్గుచూపివుంటారని, అధికారం తమదే అని ఆ పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి.
ప్రభుత్వ వ్యతిరేక ఓటా?
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ, టీడీపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగితే ఇవే అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ఉద్యోగుల ఓటు ఎటువైపు అనే చర్చ నడుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైతే ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా ఉందని అర్థం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వేశారని తెలుగుదేశం చెబుతుండగా, తమ విధానాలు నచ్చి తమకే ఓటేశారని వైసీపీ చెబుతోంది. జూన్ నాలుగోతేదీన విడుదలయ్యే పలితాల్లో ఉద్యోగులు ఎటువైపు మొగ్గారు అనే విషయంపై స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేవచిచూడటమే.












Click it and Unblock the Notifications