కంపార్ట్‌మెంట్లు కిటకిట- శిలాతోరణం వరకూ క్యూలైన్: విశేష ఉత్సవం రద్దు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం నాడు 65,225 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,106 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.63 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పట్టింది.

నేడు పుష్య పౌర్ణమి. దీన్ని పురస్కరించుకుని తిరుమలలో ఈ సాయంత్రం నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడ సేవ రద్దయింది. శ్రీవారి ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు. వేలాదిమంది భక్తులు స్వామివారి దర్శించుకుంటారు.

Pournami Garuda Seva Cancelled on Due to Adhyayanotsavams in Tirumala

శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల కారణంగా నేటి పౌర్ణమి గరుడ సేవను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా- అనుబంధ ఆలయాల్లో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై టీటీడీ దృష్టి సారించింది. దీనిపై ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయానికి విచ్చేసే దివ్యాంగ భక్తుల కోసంవుడెన్ ర్యాంప్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా సెల్ ఫోన్, లగేజీ కౌంటర్లు, మంచినీరు తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. చంటి పిల్లలకు తల్లులు పాలిచ్చేందుకు ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని అన్నారు.

ఆలయ మహా రథానికి సంబంధించి బీహెచ్ ఈఎల్ అధికారులతో సంప్రదించి మరమ్మత్తులు చేపట్టాలని అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. స్వామి వారు విహరించే వాహనాలు, తండ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి సరైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు టీటీడీ అనుబంధ ఆలయాలను అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో భక్తులకు మరింత మెరుగైన ఏర్పాట్లు చేపట్టేలా సంబంధిత ఆలయాల అధికారులు ప్రణాళికలు రూపొందించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+