ధర్నా: కిషన్ రెడ్డి అరెస్ట్, నేతలను ఎత్తుకెళ్లారు(పిక్చర్స్)

హైదరాబాద్: రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు మంగళవారం తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. నాయకుల ప్రయత్నాలను భగ్నం చేసిన పోలీసులు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి సహా బిజెపి నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ బిజెపి నేతలు రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు భగ్నం చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలోని లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నాకు దిగినవారిని పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీలను గుప్పించిన ప్రభుత్వం... కోతలతో రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని ఆరోపించారు.

విద్యుత్ విషయంలో యుద్ధప్రాతిపదికపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతం అయినట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. పత్రికా ప్రకటనలతో ఆర్భాటం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు కనీసం రెండు గంటలు కూడా విద్యుత్‌ను ఇవ్వడం లేదని బిజెపి నేతలు పేర్కొన్నారు.

కరెంట్ అడిగితే పోలీసులతో లాఠీచార్జీ చేయిస్తున్నారని, కరెంట్ సమస్యను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని వారు అన్నారు. తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తున్నట్టు నేతలు తెలిపారు.

ఇంద్రసేనారెడ్డి అరెస్ట్

ఇంద్రసేనారెడ్డి అరెస్ట్

రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి నాయకులు మంగళవారం తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

బిజెపి నేతల ధర్నా

బిజెపి నేతల ధర్నా

నాయకుల ప్రయత్నాలను భగ్నం చేసిన పోలీసులు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి, శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి సహా బిజెపి నేతలు, కార్యకర్తలను అరెస్టు చేశారు.

నేతల అరెస్ట్

నేతల అరెస్ట్

తెలంగాణలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ బిజెపి నేతలు రంగారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు భగ్నం చేశారు.

నేతల అరెస్ట్

నేతల అరెస్ట్

కలెక్టరేట్‌కు సమీపంలోని లక్డీకాపూల్ రైల్వేస్టేషన్ వద్ద ధర్నాకు దిగినవారిని పోలీసులు అరెస్టు చేశారు.

నేతల అరెస్ట్

నేతల అరెస్ట్

ఎనిమిది గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తామని హామీలను గుప్పించిన ప్రభుత్వం... కోతలతో రైతుల ఆత్మహత్యలకు కారణమవుతోందని ఆరోపించారు.

నేతల అరెస్ట్

నేతల అరెస్ట్

విద్యుత్ విషయంలో యుద్ధప్రాతిపదికపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

నేతల అరెస్ట్

నేతల అరెస్ట్

తెలంగాణ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం విజయవంతం అయినట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+