పవన్ కల్యాణ్‌పై ప్రకాష్ రాజ్ సెటైర్స్..ఎందుకు ఇలా చేస్తున్నారు
తిరుమల లడ్డూ ప్రసాద వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.గత వైసీపీ ప్రభుత్వ హాయంలోనే భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది.చంద్రబాబు చేసిన ఆరోపణలపై వైసీపీ సైతం ఘాటుగానే రియాక్ట్ అయింది. ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీ తో విచారణ చేయాలని కోరారు. సీబీఐతో విచారణ చేయించాలని..నిజం నిగ్గు తేల్చాలని పిటీషన్‌లో కోరింది వైసీపీ. పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. తాజాగా ఈ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ సైతం రియాక్ట్ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు ఆయన బదులిచ్చారు.

పవన్ కల్యాణ్ గారు...మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ఆయన నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటరిచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటరిచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications