జగన్‌ నా వాళ్లే గెలిచారు.నేను గెలిపించాను అంటే గూబ గుయ్​మంటోంది

భారత రాజకీయాల్లో తిరుగులేని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ (పీకే) సొంత రాజకీయ ప్రయాణం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత రెండు దశాబ్దాలుగా పలు పార్టీలను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన 'గేమ్-ఛేంజర్', తన సొంత పార్టీ జన్ సూరజ్ విషయంలో చతికిలపడ్డారు.

6000 కి.మీ. పాదయాత్ర, కోటి మందికి పైగా సభ్యులు, క్షేత్రస్థాయిలో 1,300 మంది నిపుణులతో భారీ యంత్రాంగాన్ని నడిపినప్పటికీ, జన్ సూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ పోటీ చేసిన 238 స్థానాల్లో దాదాపు 98% (233 సీట్లలో) డిపాజిట్లు గల్లంతయ్యాయి. కనీసం 10 లక్షల ఓట్లను కూడా సాధించలేకపోయింది.

Prashant Kishor s Bihar Shock I Made Them CM Strategist Fails in Own Election Bid

ఎన్నికలకు ముందు బీహార్‌లో ఎన్డీఏ గెలవదని, నితీష్ కుమార్ 25 సీట్లు దాటితే రాజకీయాల నుండి తప్పుకుంటానని పీకే సవాలు విసిరారు. కానీ, అంచనాలకు భిన్నంగా ఎన్డీఏ అఖండ విజయం సాధించింది, జేడీయూ 80 సీట్లకు చేరుకుంది. తన సొంత అంచనాలు, సవాళ్లు విఫలం కావడంతో, ప్రశాంత్ కిషోర్ రాజకీయాల నుండి వైదొలగుతారా అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.

"అందరికీ శకునం చెప్పే బల్లి... కుడితిలో పడింది" అన్నట్టుగా, నిపుణుల టీమ్‌తో గ్రామ గ్రామాన విస్తృతంగా ప్రచారం చేసిన పీకే, తన రాష్ట్ర ప్రజల నాడిని పట్టుకోలేకపోవడం ఆయన కెరీర్‌లోని అతిపెద్ద వైఫల్యంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.

ముఖ్యంగా జగన్ అభిమానులు ప్రశాంత్ కిషోర్‌పై ఓ రేంజ్‌పై ఫైర్ అవుతున్నారు. ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో వైసీపీకి నేను ఇచ్చిన వ్యూహాలు బాగా పని చేశాయని, దాని వల్లే విజయం సాధ్యమైందనే విధంగా మాట్లాడారు. జగన్ సైతం వైసీపీ గెలుపును ప్రశాంత్ కిషోర్‌కు ఇచ్చేశారు. అక్కడే కార్యకర్తలకు , పార్టీకి మధ్య గ్యాప్ వచ్చింది. గత ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఫలితంగా వైసీపీ దారుణంగా ఓడిపోయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ..

నరేంద్ర మోదీ,జగన్, స్టాలిన్ , కేసీఆర్ వంటి వారిని నేనే సీఎం చేశాను అని చెప్పే ప్రశాంత్ కిషోర్..సొంత పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తోంది. ఇంకోసారి నా వాళ్లే గెలిచారు.నేను గెలిపించాను అంటే బాగోదంటూ చిన్నపాటి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. వ్యూహకర్తగా విజయం సాధించిన ఆయన, క్షేత్రస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల నమ్మకాన్ని పొందడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+