వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరే హీరో, ప్రశాంత్ కిషోర్ ఎందుకు: జగన్‌కు సొంత నేతల షాక్, పరుగు పెట్టిస్తున్నారు

పార్టీకి మీరే హీరో అని, అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు అని వైసిపి అధినేత జగన్‌ను పార్టీ భేటీ సందర్భంగా పలువురు నేతలు అడిగారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: పార్టీకి మీరే హీరో అని, అలాంటప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎందుకు అని వైసిపి అధినేత జగన్‌ను పార్టీ భేటీ సందర్భంగా పలువురు నేతలు అడిగారని తెలుస్తోంది. ఇలా అడిగినట్లు వచ్చిన వార్తలను వైసిపి నేతలు కొట్టి పారేస్తున్నారు.

ప్రశాంత్ కిషోర్‌కు పవన్ కౌంటర్, జగన్ పాదయాత్రపైనా: ఇదెంత.. టిడిపితో రహస్య స్నేహంపై...ప్రశాంత్ కిషోర్‌కు పవన్ కౌంటర్, జగన్ పాదయాత్రపైనా: ఇదెంత.. టిడిపితో రహస్య స్నేహంపై...

తమ పార్టీకి హీరో జగన్ అని, అందులో ఎలాంటి సందేహం లేదని, ఆయన తమ టీం (పార్టీకి వ్యూహాలు రచించే టీం)లో చేరారని చెబుతున్నారు.

ప్రశాంత్ కిషోర్ కన్ను

ప్రశాంత్ కిషోర్ కన్ను

కాగా, ఇప్పటికే కార్యక్రమాల నిర్వహణలో ఆర్థిక లోటుపాట్లను భరిస్తున్న కన్వీనర్లకు రాబోయే 60 రోజులు మరో పరీక్ష ఎదురుకాబోతోంది. ఇంతకుముందు మాదిరిగా కాకుండా ఆసాంతం పార్టీ కార్యక్రమాలకే పరిమితం కావాలి. బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలి. సభ్యత్వ నమోదు కావాలి. కన్వీనర్లపై ప్రశాంత్ కిషోర్ బృందం కన్ను ఉంటుంది.

Recommended Video

Ysrcp Sitting MLA's Anxity For Tickets In 2019 Elections | Oneindia Kannada
అరవై రోజుల బరువు

అరవై రోజుల బరువు

హైదరాబాద్‌లో వైసిపి పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల కన్వీనర్ల సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో అరవై రోజుల బరువు, బాధ్యతలను కన్వీనర్ల ముందు ఉంచారు. పని పూర్తి చేసిన తర్వాతనే అంటూ మిగతా పనులు పక్కన పెట్టారు. జిల్లాల్లో గడపగడపకు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న కన్వీనర్ల స్థానంలో అది కూడా భవిష్యత్తులో మార్పులు, చేర్పులు ఖాయమనే వినిపించింది.

కన్వీనర్ల పనితీరుపై సర్వే

కన్వీనర్ల పనితీరుపై సర్వే

ప్రస్తుతం ఉన్న కన్వీనర్లు, పార్టీ పరిస్థితులపై సర్వే చేస్తామని చెప్పిందే తడవుగా అన్నంత పని చేసి చూపించారు ప్రశాంత్ కిషోర్. ఇది జరిగిన తర్వాత కన్వీనర్లు, మిగతా ముఖ్య నేతల్లో ఇక ఇలాంటి పరుగే ఉంటుంది, రోజువారి పరీక్షలు తప్పవనే భావన వినిపించింది. ఇప్పుడదే జరగబోతోందని అంటున్నారు. రాబోయే 60 రోజుల వ్యవధిలో ఒక నిర్దేశిత కార్యక్రమాన్ని ప్రశాంత్ కిషోర్ సమక్షంలో జగన్‌ మార్గదర్శకం చేశారు.

మన పరిస్థితి ఏమిటి?

మన పరిస్థితి ఏమిటి?

ఈ మధ్యనే ప్రశాంత్ కిషోర్ బృందం నియోజకవర్గాల వారీగా ఒక సర్వే నిర్వహించింది. జిల్లా పార్టీ దగ్గర నుంచి నియోజకవర్గ కన్వీనర్ల కమిటీ వరకు అభిప్రాయ సేకరణ చేసింది. దీని ప్రకారం ఎవరెవరికి మైనస్‌ మార్కులు పడ్డాయి, మరెవరికి మంచి మార్కులు పడ్డాయనే దానిపై వైసిపి వర్గాల్లో ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జిల్లాలో దాదాపు ఆరు నియోజకవర్గాల్లో ప్రశాంత్ కిషోర్ బృందం మైనస్‌ మార్కులు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

English summary
It is said some YSR Congress Party leaders are questioned party chief YS Jaganmohan Reddy about Prashanth Kishore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X