పగ... పగ... పగతో రగిలిపోతున్న పల్నాడు?

నిత్యం పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడిలో పల్నాడు చలికాచుకుంటోంది.

పల్నాడు అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు పురిటిగడ్డ లాంటిది. నిత్యం పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడిలో పల్నాడు చలికాచుకుంటోంది. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగిన సంగతి తెలిసిందే. చరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ప్రస్తుతం రాజకీయ రణరంగంగా మారింది.

ఆధిపత్యం కోసం ఒకరు.. అధికారం కోసం మరొకరు..

ఆధిపత్యం కోసం ఒకరు.. అధికారం కోసం మరొకరు..

ఆధిపత్యం కోసం ఒకపార్టీ, అధికారం కోసం మరొకపార్టీ కత్తులు దువ్వుతున్నారు. అవే పల్నాడు ప్రాంతాన్ని యుద్ధభూమిగా మార్చాయి. మాచర్ల నియోజకవర్గంలోని రాజకీయ కక్షలు చినికి చినికి గాలివానలా మారి తుఫానుగా రూపాంతరం చెందాయి. మాచర్లలో జల్లయ్య హత్యతో మొదలై నరసరావుపేటలో వెన్నా బాలకోటిరెడ్డి హత్య వరకు ఎన్నో ఉదంతాలు కనపడతాయి. ఏపీలో అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే పల్నాడు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు తలపెట్టిన ఈ కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వైసీపీ నాయకులు అత్యుత్సాహం కూడా దీనికి తోడైంది. మాచర్ల లో నిర్వహించిన ఇదేం ఖర్మ కార్యక్రమం కారణంగా అక్కడ వైసీపీ, టీడీపీ మధ్య చిన్నపాటి యుద్ధం జరిగింది.

తగలబడిన ట్రాక్టర్

తగలబడిన ట్రాక్టర్


మూడురోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం మిరియాల గ్రామంలో పర్యటించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డికి ఆ గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తర్వాత ట్రాక్టర్ మీద ఎక్కించి ఊరంతా వైభవోపేతంగా ఊరేగించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం బ్రహ్మారెడ్డి ని ఊరేగించిన ట్రాక్టర్‌ తగలబడింది. ఇది మిరియాలతోపాటు పల్నాడులో సంచలనం కలిగించింది. వైసీపీ చేసిన పనేనని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.

పోలీసులపైనే బాధ్యత

పోలీసులపైనే బాధ్యత


బి.సి సామాజికవర్గానికి చెందిన చెందిన బత్తుల ఆవులయ్య ట్రాక్టర్‌ని తగలబెట్టడం దుర్మార్గమైన చర్య అంటూ బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు తెలుగుదేశం పార్టీతోనే నడుస్తున్నాయనే అక్కసుతోనే వైసీపీ శ్రేణులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ వైషమ్యాలను అరికట్టాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ చోద్యం చూస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గొడవలకు బాధ్యులైన వారిపై ఖఠిన చర్యలు తీసుకుని పల్నాడు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకోల్పడానికి కృషి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+