వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిలో రాష్ట్రపతి పాలన: 40 ఏళ్ల తర్వాత రెండోసారి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి మండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో దాదాపు నలభై ఏళ్ల తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తున్నారు. కేంద్ర మంత్రి మండలి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం ఉదయం భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో మంత్రివర్గం రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపింది

ఇక ఎపిలో రాష్ట్రపతి పాలన లాంఛనమేనని తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించవలసి ఉంటుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముంది. కాగా, అసెంబ్లీని సస్పెండెడ్ యానిమేషన్‌లో పెట్టారు.

 President Rule in AP?

రాష్ట్రంలో రెండోసారి

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం ఇది రెండోసారి అవుతుంది. 1973లో ఆంధ్ర ఉద్యమ సమయంలో మొదటిసారి రాష్ట్రపతి పాలన విధించారు. ఇప్పుడు రెండోసారి ఎపిలో రాష్ట్రపతి పాలన విధించనున్నారు. రాష్ట్రపతి పాలనలో పాలనా పగ్గాలు గవర్నర్ చేతికి వెళ్తాయి.

సిఎస్ మహంతిని కలిసిన గవర్నర్ స్పెషల్ సెక్రటరీ

సిఎస్ మహంతిని గవర్నర్ స్పెషల్ సెక్రటరీ రమేష్ కలిసినట్లుగా తెలుస్తోంది.

English summary
It is said that Union Cabinet gave green signal to president Rule in Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X