పూజారి నిర్వాకం: పూజ కోసం వచ్చిన బాలికను లైన్‌లో పెట్టాడు, అరెస్ట్
అమరావతి: పూజల పేరుతో ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె కూతురిని కిడ్నాప్ చేసిన పూజారిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గుంటూరు జిల్లాలో పేరుగాంచిన పెదకాకాని శివాలయంలో చదలవాడ కిషన్‌కుమార్ అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఇతగాడికి కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను వెంట బెట్టుకుని శివాలయానికి పూజల కోసం వెళుతుండేది. ఈ క్రమంలో పూజారి కిషన్ కుమార్ అలియాస్ కిషోర్ పూజా కార్యక్రమాల పేరుతో ఆ మహిళతో పరిచయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత అప్పుడప్పుడూ యువతి ఇంటికి కూడా వెళుతూ ఉండేవాడు. ఇలా ఇంటికి వెళుతోన్న క్రమంలో మహిళతో పాటు ఆమె కుమార్తెకు మాయమాటలు చెప్పేవాడు. ఇలా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి ఆ బాలికను తీసుకెళ్లాడు.

దీంతో తమ కుమార్తె కనిపించకుండా పోవడానికి కారణం శివాలయం పూజారేనంటూ అదే రోజు రాత్రి ఆ మహిళ పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే రెండు రోజుల క్రితం ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్ళి చేసుకున్నామంటూ కనిపించకుండా పోయిన వారిద్దరూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
దీంతో మాయమాటలు చెప్పి యువతిని కిడ్నాప్ చేసిన కేసులో కిషన్‌కుమార్‌ను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ సీహెచ్ చంద్రమౌళి తెలిపారు. నిందితుడికి 15 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పూజారి భార్య, ఇద్దరు పిల్లలు ఎంతో మనోవేదనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications