రైళ్లు -బస్సులు ఫుల్, దసరా "స్పెషల్" దోపిడీ..!!

దసరా పండగ వేళ ప్రయాణ ప్రాంగణాలు రద్దీగా మారాయి. హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు, బస్సులు కిక్కిరిశాయి. సొంత వాహనాలపైనా నగరవాసులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది. ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ బస్సులు రంగంలోకి దిగాయి.

సొంతూరి బాట
హైదరాబాద్ నుంచి నగర ప్రజలు సొంతూరి బాట పట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్‌స్టేషన్‌ల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది. దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ 5,250కి పైగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించింది.

Private buses have doubled the charges in the wake of Dasara festival, People travelling to home towns

రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా కావడంతో జిల్లాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. రోజువారీ రాకపోకలు సాగించే సుమారు 3,500 బస్సులతో పాటు ఇప్పటి వరకు 1,700కు పైగా బస్సులను అదనంగా నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

బస్సులు, రైళ్లు కిటకిట
నాంపల్లి, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లు కూడా కిటకిటలాడాయి. రెగ్యులర్‌ రైళ్లలో చాలా రోజుల క్రితమే రిజర్వేషన్‌లు బుక్‌ కావడంతో చాలామంది జనరల్‌ బోగీలను ఆశ్రయించారు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే సాధారణ బోగీలు సైతం ప్రయాణికులతో నిండిపోయాయి. హైదరాబాద్‌ నుంచి కాకినాడ, నర్సాపూర్‌, తిరుపతి, కర్నూలు, విశాఖ, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సుమారు 1.85 లక్షల మంది రైళ్లలో ప్రయాణం చేస్తారు. పండుగ సెలవుల దృష్ట్యా గత మూడు రోజులుగా ప్రతి రోజు సుమారు 25వేల మంది అదనంగా ప్రయాణం చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రెట్టింపు ఛార్జీలతో దోపిడీ
ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ప్రైవేట్‌ బస్సులు రంగంలోకి దిగాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్‌లు లభించని దూరప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ప్రైవేట్‌ బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో సాధారణ రోజుల్లో విధించే చార్జీలను రెట్టింపు చేసి వసూలు చేస్తున్నారు. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి విశాఖకు రూ.980 వరకు చార్జీ ఉంటే రూ.1600కు పైగా వసూలు చేస్తున్నారు.

విజయవాడకు రూ.450 నుంచి రూ.800కు పెంచారు. డిమాండ్ కు అనుగుణంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో, బస్సులు, రైళ్లతో పాటు కార్లు, బైక్‌లు వంటి సొంత వాహనాల్లోనూ నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో పలు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరాయి. గంటలతరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మరో మూడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+