పవన్ దెబ్బ: టిడిపి కాపు నేతల పరిస్థితి...ముందు నుయ్యి వెనుక గొయ్యి
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం టీడీపీ అధినేత చంద్రబాబును వ్యక్తిగతంగా ఎంత ఇబ్బందికి గురి చేసిందో...అదే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లోని కాపు నేతలకు కూడా అంతటి షాక్ నిచ్చింది.
Recommended Video

పవన్ తన ప్రసంగంలో చంద్రబాబు, లోకేష్ అవినీతిని సూటిగా ప్రశ్నించడంతో ఇప్పుడు ఆ పార్టీలోని కాపు నేతల పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది. పవన్ విమర్శలపై స్పందిస్తే ఒక తంటా...స్పందించకుంటే మరో తంటా లాంటి పరిస్థితి ఉండటంతో ఏం చెయ్యాలో తెలియక కొంతకాలం సైడయ్యి పోవటం బెటరని నిర్ణయించుకున్నారట. అందుకే టిడిపి లోని కాపు నేతలు ఎక్కువమంది ఈ పరిస్థితుల్లో మీడియా ముందుకు రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది.

టిడిపి కాపు నేతలకు...గట్టి షాకే!...
జనసేన ఆవిర్భావ సభలో చంద్రబాబును, లోకేష్ ను, టిడిపి ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఉరుమురిమి మంగలం మీద పడిన చందంలా తెలుగుదేశం పార్టీలోని కాపునేతలను ఊహించని కష్టంలోకి నెట్టింది. పవన్ ఏవో కొన్ని వ్యవస్థాపరమైన విమర్శలు చేసివుంటే ఏదోలోగా ప్రతిస్పందించి కవర్ చేసే అవకాశం అందరికీ ఉండేది. అయితే పవన్ లోకేష్, చంద్రబాబు అవినీతి గురించి ఎండగట్టడంతో పాటు టిడిపి పరిపాలనా విధానం...ఎమ్మెల్యేల దౌర్జన్యం వంటి అంశాలను సూటిగా విమర్శించడంతో టిడిపిలోని మిగిలిన సామాజిక నేతల వర్గాల సంగతి అటుంచితే కాపు నేతలకు మాత్రం ఇప్పుడు ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదట.

కారణం...ఏమిటంటే...
టిడిపి పరిపాలనతో పాటు సాక్షాత్తూ తమ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై నేరుగా తీవ్ర విమర్శలు చేసిన ఈ తరుణంలో ఆ పార్టీలోని కాపు నేతలు కనీసం స్పందించకుంటే చంద్రబాబు,లోకేష్ అంతే తీ్రంగా హర్టవడం ఖాయం...అలాగని పవన్ పై ఎదురుదాడి చేస్తే సొంత సామాజికవర్గం నుంచీ వ్యతిరేకత చవిచూడాల్సిన పరిస్థితి...సైలెంట్ గా వుంటే సొంత పార్టీ అధినేతల నుంచి...వైలెంట్ గా వుంటే సొంత సామాజిక వర్గం నుంచి ఇబ్బందులు తప్పని స్థితి.

తప్పించుకు తిరుగువాడు...ధన్యుడు సుమతీ
అందుకే...ఈ పరిస్థితిలో టిడిపి కాపు నేతలు సుమతీ శతకంలో చెప్పినట్లు తప్పించుకు తిరగడం బెటరని నిర్ణయించుకున్నారట. కొందరేమో పవన్ స్పీచ్ ముగియడంతోనే రాగల పరిణామాలు ఊహించి ముందుగానే అందుబాటులో లేకుండా పోతే...కొందరికి తమ అనుచరులతో మాట్లాడాక గానీ జ్ఞానోదయం కాలేదట...సరే లేటుగా అయినా విషయం అర్థం చేసుకున్న సదరు నేతలు ముందు అసలు సమస్య వచ్చేది మీడియాతోనే కాబట్టి మీడియాకు అందుబాటులో లేకుండా పోయారట.

అయినా భయంగానే...కారణం...
అయితే ఇలా మీడియా ముందుకు రాకుండా దూరంగా ఉన్నా టిడిపి కాపు నేతల గుండెల్లో గుబులు గానే ఉందట. కారణం టిడిపి అధినేత చంద్రబాబు ఇలాంటి పరిస్థితులప్పుడే చాలా అలెర్ట్ గా ఉంటారని...ఇలాంటప్పుడు తనకు సపోర్ట్ చేసిన వారికే ఆ తరువాత ప్రాధాన్యం ఉంటుందని మధనపడిపోతున్నారట. అలాగని ధైర్యం చేసి పవన్ పై ఎదురుదాడి చేద్దామంటే కాపు యువత ఆవేశం...పవన్ పట్ల వారికి ఉన్న వీరాభిమానం గుర్తుకు వచ్చి ముందుకు వెళ్లే ధైర్య చేయలేకపోతున్నారట...ఇప్పుడు వీరు కోరుకుంటుంది ఒకటేనట...చంద్రబాబు దృష్టిలో పడకుండా కొన్ని రోజులు సజావుగా సాగిపోతే చాలని అట...ఆ తరువాత ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరక్కపోదని ఆశపడుతున్నారట...
-
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..!












Click it and Unblock the Notifications