పిఠాపురంలో పవన్ ఓడిపోతాడని పందెం కట్టి 10 కోట్లు పోగొట్టుకున్న నిర్మాత..?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రజలు కూటమి నేతలకు పట్టం కట్టారు. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. ఇక కూటమి తరుఫున పోటీ చేసిన నాయకులు విజయం సాధించారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్ వంటి నేతలు భారీ విజయాలు నమోదు చేశారు.

ఇక ఈ ఎన్నికల్లో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు. ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని భారీగానే పందెలు జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవై వేల కోట్లకు పైగానే ఈ పందెలు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. గెలుపు ఎవరితో తెలియకుండానే కూటమి, వైసీపీ పార్టీలపై కోట్లు, లక్షలు, ఆస్తులు కూడా బెట్టింగ్‌లో పెట్టినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగింది.కదిరిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని పందెం వేశారు. మరొకరేమో ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.10 లక్షలు పందెం వేయడం విశేషం. అయితే వైసీపీకి చెందిన నేత ఒకరు కదిరిలో టీడీపీ గెలుస్తుందని పందెం వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

producer who bet that Pawan will lose in Pithapuram

దీనికి సంబంధించిన ఒప్పంద పత్రం కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన కీలక నిర్మాత ఒకరు వైసీపీ గెలుస్తుందని..పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోతున్నారని రూ.10 కోట్లు పందెం కాసినట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా కూటమి గెలవాలని కోరుకున్న తరుణంలో ఒక్క ఈ నిర్మాత మాత్రమే వైసీపీ తిరిగి విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నారట. వైసీపీకి అనుకూలంగా.. పవన్‌కు వ్యతిరేకంగా పందెం వేసి.. అతను భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ నిర్మాత ఎవరనేది మాత్రం తెలియడం లేదు. దీంతో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో అనే అనుమానం కలుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+