వైసీపీకి ఇక సెలవు - సీఎం సొంత జిల్లాలో హోర్డింగులు : నేతలపై పోస్టులు..!!
ఏపీలో వైసీపీ టార్గెట్ రాజకీయాలు వేగవంతం అవుతున్నాయి. ప్రధానంగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమ పైన ప్రతిపక్ష పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అందు కోసం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం ఇప్పుడు ఆయుధంగా మారుతోంది. ఇతర ప్రాంతాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే...మరి కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకిస్తున్నారు. అయితే, ప్రజాభిప్రాయ సేకరణ తరువాత తుది నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో తాజాగా... సీఎం సొంత జిల్లా కడపలో హోర్డింగ్ లు వెలుగులోకి వచ్చాయి.

సీఎం జగన్ కంచుకోటలో..
అన్నమయ్య జన్మస్థలి, పార్లమెంట్, రెవెన్యూ డివిజన్ కేంద్రమైన రాజంపేటను జిల్లా కేంద్రం చేయకుండా కనీసం మంచినీళ్లు దొరకని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడం ఏమిటంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా రాజంపేటకు సమీపంలో రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లె ముఖద్వారం వద్ద ఆ గ్రామస్థులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..
‘‘జిల్లాల విభజన వంచనకు నిరసనగా బరువెక్కిన హృదయాలతో వైఎస్సార్‌సీపీకి ఇక సెలవు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు'' అని ఫ్లెక్సీపై రాసుకొచ్చారు. అక్కడే నిరసనకు దిగారు. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు కనబడడం లేదని, వారు ఉద్యమంలో పాల్గొనడం లేదంటూ ఆందోళనకు దిగారు.

అధికార వైసీపీ నేతలపై ఒత్తిడి
వీరికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కడప-చెన్నై హైవేపై రాజంపేట, నందలూరు సమీపంలోని చెయ్యేరు వంతెన వద్ద టీడీపీ నేతలు రోడ్డును దిగ్బంధించి నిరసన వ్యక్తం చేవారు. రాయచోటి వద్దు-రాజంపేట ముద్దు, అన్నమయ్య గడ్డను జిల్లా కేంద్రం చేయాలి, రాజంపేటను వంచించిన వైసీపీ నేతలు వెంటనే రాజీనామా చేయాలి, సీఎం ‘డౌన్.. డౌన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో రాజంపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అఖిలపక్ష నేతలు రెండో రోజు కూడా రిలే దీక్షలు చేపట్టారు. కర్నూలులో డోన్ కోసం కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గం కరువు ప్రాంతమని, జిల్లాల విభజన పేరుతో ప్రజలకు అన్యాయం చేయవద్దని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
Recommended Video

రాజకీయ సెంటిమెంట్ గా మారుతోందా
హిందూపురంలో..అనంతపురం జిల్లాను విడదీసి పుట్టపర్తి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న శ్రీసత్యసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వైసీపీయేతర అఖిలపక్ష నేతలు కోరుతూ నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. మరో వైపు ఉత్తరాంధ్ర.. గోదావరి జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు ప్రదర్శనలు నిర్వహించారు.
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. కొత్త జిల్లాలకు పేర్ల విషయంలో కొన్ని చోట్ల ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయి. అయితే, సీమ ప్రాంతంలో.. ప్రధానంగా కడప - అనంతపురం జిల్లాల్లో మాత్రం ప్రభుత్వం ప్రతిపాదనల పైన నిరసన వ్యక్తం అవుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాతనే తుది నిర్ణయమని చెబుతున్నా..ఆందోళన కొనసాగుతోంది.
దీంతో...రాజంపేట... హిందూపురం స్థానికుల డిమాండ్ విషయంలో ప్రభుత్వం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఈ నిర్ణయాలు రాజకీయంగానూ రానున్న ఎన్నికల పైన ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications