నిరసన: రాయల టీపై భగ్గుమన్న తెలంగాణ (పిక్చర్స్)

హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనపై బుధవారం తెలంగాణలో నిరసనలు వెల్లువెత్తాయి. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ర్యాలీలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆయన పిలుపు మేరకు హైదరాబాదులో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. మరోసారి హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం భగ్గుమంది.

రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. రాయల తెలంగాణ వద్దు అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. సచివాలయంలో బైఠాయింపు జరిపారు. తెలంగాణ విద్యార్థులు తెలంగాణ అమర వీరుల స్థూపం గన్‌పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు పాల్గొన్నారు.

తెలంగాణలోని పది జిల్లాలతో రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిపి రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు, ఈ మేరకు ముసాయిదా బిల్లు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం ఆందోళనలకు దిగారు. రేపు గురువారం తెరాస తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.

గన్‌పార్కు వద్ద విద్యార్థుల ధర్నా

గన్‌పార్కు వద్ద విద్యార్థుల ధర్నా

హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం గన్‌పార్కు వద్ద రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో తెరాస శానససభ్యుడు కెటి రామారావు కూడా పాల్గొన్నారు. TRSV.jpg

రాయల తెలంగాణ వద్దు..

రాయల తెలంగాణ వద్దు..

తమకు తెలంగాణ మాత్రమే కావాలని, రాయల తెలంగాణ వద్దని నినదించించిన కెటి రామరావు, విద్యార్థులు

టిఆర్ఎస్వీ ధర్నా..

టిఆర్ఎస్వీ ధర్నా..

తెరాస విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాయల తెలంగాణకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది.

భారీ భద్రత ఇలా...

భారీ భద్రత ఇలా...

సచివాలయం వద్ద తెలంగాణ ఉద్యోగుల నిరసన ప్రదర్శన సందర్భంగా బుధవారం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

నినాదాలు చేసిన టీ ఉద్యోగులు

నినాదాలు చేసిన టీ ఉద్యోగులు

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బుధవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ప్రదర్సన నిర్వహించారు. రాయల తెలంగాణ వద్దని వారు డిమాండ్ చేశారు.

రాయల తెలంగాణను వ్యతిరేకిస్తాం..

రాయల తెలంగాణను వ్యతిరేకిస్తాం..

రాయల తెలంగాణను వ్యతిరేకిస్తామంటూ నినాదాలు రాసిన పోస్టర్లను ప్రదర్శిస్తూ తెలంగాణ మహిళా ఉద్యోగులు ఇలా..

టీ ఉద్యోగుల ధర్నా..

టీ ఉద్యోగుల ధర్నా..

రాయల తెలంగాణను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యోగులు సచివాయలంలో బుధవారం ధర్నా నిర్వహించారు.

టీ ఉద్యోగుల ర్యాలీ

టీ ఉద్యోగుల ర్యాలీ

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యోగులు ఇలా ర్యాలీ నిర్వహించారు. రాయల తెలంగాణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్యోగుల బైఠాయింపు..

ఉద్యోగుల బైఠాయింపు..

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా బుధవారం తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో ఇలా బైఠాయింపు జరిపారు.

పది జిల్లాల తెలంగాణే కావాలి..

పది జిల్లాల తెలంగాణే కావాలి..

తమకు రాయల తెలంగాణ వద్దని, పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం మాత్రమే కావాలని డిమాండ్ చేస్తూ తెరాస కార్యకర్తలు సికింద్రాబాదు‌లోని చిలకలగుడాలో ర్యాలీ నిర్వహించారు.

గాంధీ ఆస్పత్రి వద్ద..

గాంధీ ఆస్పత్రి వద్ద..

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద నిరసన ప్రదర్శన ఇలా..

తెలంగాణ వైద్యులు..

తెలంగాణ వైద్యులు..

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా గాంధీ ఆస్పత్రిలో వైద్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు పోస్టర్లను ప్రదర్శిస్తూ తమ నిరనస తెలిపారు.

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత..

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనతో బుధవారంనాడు గాంధీ ఆస్పత్రి వద్ద కాస్తా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రోడ్డుపై బైఠాయింపు..

రోడ్డుపై బైఠాయింపు..

రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద వైద్య విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

రాస్తారోకో ఇలా...

రాస్తారోకో ఇలా...

గాంధీ ఆస్పత్రి వద్ద రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా రాస్తా రోకో కూడా నిర్వహించారు. ట్రాఫిక్‌ను అడ్డగిస్తూ ఇలా.

సికింద్రాబాద్ కోర్టు వద్ద..

సికింద్రాబాద్ కోర్టు వద్ద..

సికింద్రాబాద్ కోర్టు వద్ద తెలంగాణ న్యాయవాదులు రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ప్రదర్సన నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+