కాంగ్రెస్‌లో సైకో ఫ్యాన్స్, కిరణ్ చుట్టు కూడా: జెసి దివాకర్

రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి ఒక్క సీటు కూడా రాదని తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పానన్నారు. పార్టీ అధిష్టానానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక్కరు వాస్తవాలను చెప్పడం లేదన్నారు. తనకు ఇప్పటి వరకు షోకాజ్ నోటీసు అందలేదని తెలిపారు.
రాజ్‌భవన్ ముట్టడికి టి విద్యార్థుల యత్నం
గవర్నర్ నివసించే రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు తెలంగాణ ప్రాంత విద్యార్థులు సోమవారం ఉదయం ప్రయత్నించగా పంజాగుట్ట పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. రాజ్ భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన నేపథఅయంలో రాజ్ భవన్ రోడ్డుకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, సభాపతి నాదెండ్ల మనోహర్ సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధుల నిరసనల మధ్య శాసన సభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంతం వాడిగా వేడిగా ఉంది.












Click it and Unblock the Notifications