నా కొడకా కాల్చి పడేస్తా..వైసీపీ కార్యకర్తలపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన డీఎస్పీ

ఆంధ్రప్రదేశ్‌లోని పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వం మరియు వైసీపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, పోలింగ్ రోజు అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు, ఘర్షణలు జరిగాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో, ఉదయం నుంచే వైసీపీ కీలక నాయకులైన ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సంఘటనల మధ్య, పులివెందులలోని వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Pulivendula DSP Murali Nayak s Abusive Warning to YCP Workers Goes Viral

డీఐజీ కోయ ప్రవీణ్ ,డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆ సమయంలో వైసీపీ కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. జనం గుమిగూడటాన్ని చూసిన డీఎస్పీ మురళి నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అక్కడున్న కార్యకర్తలను ఉద్దేశించి ఆయన "మీరు తాగి ఉండవచ్చు... ఇక్కడ ఉంది ఖాకీ" అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, "కాల్చిపడేస్తా నా కొడకా" అంటూ తీవ్రమైన భాషను ఉపయోగించారు. గుంపులుగా ఉండొద్దని, అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ డీఎస్పీ హెచ్చరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+