దస్తగిరి నామినేషన్‌కు గ్రీన్ సిగ్నల్
కడప: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రొవర్ షేక్ దస్తగిరి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి అంగీకరించారు. షేక్ దస్తగిరి పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అయితే, దస్తగిరి నామినేషన్ ని అంగీకరించవద్దంటూ 28 అబ్జెక్షన్స్ దాఖలయ్యాయి.
దస్తగిరి నామినేషన్‌ని అడ్డుకొనటానికి తీవ్ర ప్రయత్నం చేసింది అధికార వైయస్సార్సీపీ. రిటర్నింగ్ ఆఫీసర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంతో స్క్రూటినీలో దస్తగిరి నామినేషన్ కు ఆమోదం లభించింది. కాగా, జై భీమ్ రావు భారత్ పార్టీ నుంచి దస్తగిరి పోటీ చేస్తున్నారు.

రానున్న ఎన్నికల్లో అధికార వైయస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరినీ ఓడించి పులివెందుల ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యం అంటే పరిపాలన రూపంలో అందిస్తానంటున్నారు దస్తగిరి. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పులివెందుల ప్రజలకు సేవ చేస్తానంటున్నారు.
తన నామినేషన్ ప్రక్రియలో అడుగడుగున అడ్డంకులు సృష్టించారని దస్తగిరి చెప్పారు. అధికార వైఎస్ఆర్సీపీకి ఇదే చివరి ఎన్నికలని అన్నారు. రానున్న ఎన్నికల్లో జై భీమ్ రావు భారత్ పార్టీ అద్భుతాలు సృష్టించబోతోందని దస్తగిరి వ్యాఖ్యానించారు. తన నామినేషన్ నిష్పక్షపాతంగా అంగీకరించిన ఎన్నికల కమిషన్ అధికారులకు దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications