ఫ్రెండ్ ఘోరం: ఏడేళ్ల చిన్నారికి బ్లూఫిలిమ్స్ చూపించి రేప్

Pump worker rapes 7 year old girl
హైదరాబాద్: ఏడేళ్ల చిన్నారి పైన దారుణం జరిగింది. లంగర్ హౌస్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే ముప్పై ఏళ్ల అజం మూసాపేటలోని ఓ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. గతంలో అతను ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే మరో ఆటో డ్రైవర్‌తో స్నేహం కుదిరింది.

పది రోజుల క్రితం ఆ ఆటో డ్రైవర్, ఆయన భార్య బయటకు వెళ్లడం గమనించిన అజం.. వారి ఇంటికి వెళ్లాడు. ఆటో డ్రైవర్ కుమార్తె, బాలిక తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. బాలిక వయస్సు ఏడేళ్లు. చాక్లెట్లు తీసుకు రావాలని బాలిక తమ్ముడిని బయటకు పంపించాడు. ఆ సమయంలో సెల్‌ఫోన్‌లో నీలి చిత్రాలు చూపించి ఆ బాలిక పైన అజం అత్యాచారానికి పాల్పడ్డాడు.

తర్వాత ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. బయటకు తెలియకూడదని వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఈ సంఘటన అక్టోబర్ 30వ తేదీన జరిగింది. కానీ ఆలస్యంగా ఈ ఘోరం వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి ఆటో డ్రైవర్ అని, తల్లి ఇంట్లోనే ఉంటుందని పోలీసులు శనివారం తెలిపారు. అజం తన పైన అఘాయిత్యానికి పాల్పడిన విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు కూడా మూడు రోజులు ఆలస్యంగా చెప్పింది.

అనుమానాస్పద స్థితిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌ మృతి

శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ రత్నకుమారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె మృతికి సహోద్యోగి వేధింపులే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం పీరుసాహెబ్‌పేటకు చెందిన కె.రత్నకుమారికి జి.సిగడాం మండలం దవళపేటకు చెందిన రాజేష్‌తో మూణ్ణెళ్ల కిందట వివాహమైంది.

వీరు శ్రీకాకుళం మండలం ఏఎస్‌ఎన్‌ కాలనీలో నివాసముంటున్నారు. రత్నకుమారి రిమ్స్‌లో ల్యాబ్‌టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. తనతోపాటు ల్యాబ్‌టెక్నీషియన్‌గా పని చేస్తున్న హరి కొంతకాలంగా ఫోన్లో వేధిస్తున్నారు.

ఈ విషయం ఆమె భర్త రాజేష్‌కు తెలుపగా, ఆయన హరిని హెచ్చరించినా అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో శనివారం ఆమె ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+