జగన్‌పై రఘురామ కృష్ణంరాజు పాజిటివ్ కామెంట్స్

వివాదాస్పద నేతగా గుర్తింపు తెచ్చుకున్న రఘురామ కృష్ణంరాజు మరోసారి వార్తల్లో నిలిచారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించిన రఘురామ కృష్ణంరాజు గెలిచిన కొద్ది రోజులకే ఆ పార్టీకి వ్యతిరేకంగా మారారు. కొన్నిసందర్భాల్లో అప్పటి సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. ఆ తర్వాత కూటమి తరుఫున నరసాపురం ఎంపీగా పోటీ చేయాలని చూసినప్పటికి ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తెరవెనుక పావులు కదిపిన ఆయన ఎలాగైతే టీడీపీ తరుఫున టికెట్ దక్కించుకున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న రఘురామ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. కూటమి ప్రభుత్వంలో తనకు స్పీకర్ లేదా మంత్రి పదవి ఇస్తుందని ఆశించిన రఘురామకు నిరాశ తప్పలేదు. దీనిపై బహిరంగంగానే బాబుపై ఆయన విమర్శలు చేశారు. మొత్తానికి ఎలాగైతే డిప్యూటీ స్పీకర్ పదవిని దక్కించుకున్నారు.

Raghurama Krishnam Raju positive comments on Jagan

తాజాగా ఆయన జగన్‌పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఆయన మాట్లాడుతూ..సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని, జగన్ అసెంబ్లీకి రావాలని విజ్క్షప్తి చేశారు.అసెంబ్లీలో ప్రతిపక్షమూ అవసరమేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని జగన్‌కు సైతం చెప్పానని రఘురామ కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు.

తనకు తగిన సమయం ఇవ్వరేమో అనే జగన్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారని, ఆయన సభకు వస్తే ఆయన అడిగినంత సమయం ఇస్తామని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో ఎక్కడా లేదని అదే సమయంలో అలాంటి నిబంధన లేనపుడు ఆనవాయితీని ఆచరించవలసి ఉంటుందని కూడా ఉందని అన్నారు.ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్‌కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుందని అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తేనే బాగుంటుందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+