నరసాపురం నాదే-రెండ్రోజుల్లో ఎన్డీయే అభ్యర్ధిగా ప్రకటన-రఘురామ కామెంట్స్..!
ఏపీలో ఈసారి ఎన్నికల్లో తన సిట్టింగ్ సీటు అయిన నరసాపురం లోక్ సభ స్ధానం ఆశించి భంగపడ్డ వైసీపీ మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరసాపురం సీటును టీడీపీ నుంచి పొత్తులో భాగంగా తన కోసం తీసుకుని ఇవ్వకపోవడంపై బీజేపీని టార్గెట్ చేసిన రఘురామ.. ఆ తర్వాత చంద్రబాబుపైనా విమర్శలకు దిగారు. దీంతో రఘురామకు దారులన్నీ మూసుకుపోయినట్లేనని భావిస్తున్న వేళ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదామిరంలోని తన సొంత ఇంటికి చేరుకున్న నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇవాళ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి నుండి నర్సాపురం పార్లమెంటుకు పోటీలో ఉంటానని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు తనకు కచ్చితంగా ఎన్డీఏ కూటమి తరపున న్యాయం చేస్తారని తెలిపారు.

రెండు మూడు రోజుల్లోగా ఎన్డీఏ కూటమి నుండి నిర్ణయం వెలువడుతుందని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ బరిలో అయితే ఉండటం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి తరపున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయలనేది ప్రజల కోరిక అని రఘురామ చెప్పుకొచ్చారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాను వేసిన కేసులు పై ఏప్రిల్ ఒకటో తేదీన ట్రయల్ కు వస్తున్నాయని, ఇప్పటికే మూడు వేల సార్లు జగన్మోహన్ రెడ్డి వాయిదాలు కోరారని, కోర్టు కూడా అన్ని సార్లు నిబంధనల మేరకు వాయిదాలు ఇవ్వకూడదని రఘురామ తెలిపారు.












Click it and Unblock the Notifications