ర్యాగింగ్ పేరిట వేధింపు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Raging: A girl student attempts commit suicide
చిత్తూరు: కఠిన నిబంధనల కారణంగా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న ర్యాగింగ్ భూతం మళ్లీ కోరలు చాస్తోంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి అగ్రికల్చర్ యూనివర్సిటీలో తాజాగా మరో ర్యాగింగ్ ఘటన వెలుగుచూసింది. ర్యాగింగ్ పేరిట సీనియర్ల వేధింపులు బరించలేని ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

తిరుపతి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిప్లమో మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంకను కొద్ది రోజులుగా ఆమె సీనియర్లు ర్యాగింగ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక హాస్టల్ గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించిన స్నేహితులు, హుటాహుటిన రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రియాంక పరిస్థితి నిలకడగానే ఉందని, కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.

అయితే ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తోంది. కాగా ర్యాగింగ్‌కు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+