కర్నూలులో రాహుల్ గాంధీ: సంజీవయ్యకు నివాళి, విద్యార్థులతో ముఖాముఖి

కర్నూలు/అమరావతి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలులో పర్యటిస్తున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కర్నూలుకు చేరుకున్నారు.

కర్నూలులోని పెదపాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Rahul Gandhi pays tribute to former Andhra Pradesh CM Damodaram Sanjivayya

మంగళవారం మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. పార్టీ నేతలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

రాహుల్ రాకతో ఏపీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తునకర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో 'నేను కర్నూలులో ఉన్నాను' అంటూ తన షెడ్యూల్‌ను పోస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+