ఏపీ ప్రభుత్వం రిమోట్ కంట్రోల్ అక్కడే - రాహుల్ కీలక వ్యాఖ్యలు..!!

తొలి సారిగా ఏపీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ విమర్శలు చేసారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో రాహుల్ ఆదోని మండలం ఆరేకల్ సభలో ప్రభుత్వంతో పాటుగా ఏపీలోని పార్టీలపైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ ప్రభుత్వ రిమోట్ కంట్రోల్ బీజేపీ దగ్గర ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ లోని అన్ని రాజకీయపార్టీల రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతిలో ఉన్నాయని చెప్పారు. మోడీ చేతిలో ఏపీ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీని ప్రధాని మోడీ రిమోట్ తో శాశిస్తున్నారని.. అందుకు కారణం ఏమిటో తెలుసంటూ చెప్పుకొచ్చారు.

బీజేపీతో ఏపీ ప్రభుత్వానికి కమిటీ మెంట్స్ ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఎపితో చాలా కమిటీ మెంట్స్ ఉన్నాయని చెప్పారు. విభజన హామీల్లో భాగంగా.. పోలవరం పూర్తి చేయటం తో పాటుగా ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేసారు. రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టం చేసారు. విభజన అంశాలను లేవనెత్తటంతో ఏపీ ప్రభుత్వం విఫలం చెందిందని రాహుల ఆరోపించారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్నందుకు ఈ అంశాలు లెవనెత్తడం లేదని విమర్శించారు. రాయలసీమకు న్యాయం చేయటంతో పాటుగా.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ పునరుద్ఘాటించారు.

Congress Leader Rahul Gandhi key comments against YSRCP Govt, Says AP Remote with PM Modi.

ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయాన్ని రాహుల్ తప్పుబట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని, ఒకే రాజధాని ఉండాలనేది తమ విధామని స్పష్టం చేసారు. అమరావతి రైతులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఆదోని నుంచి పాదయాత్రగా బయలుదేరిన రాహుల్‌ బైచిగేరి సమీపంలో పొలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకుని నివాసముంటున్న రాజాసాహేబ్‌ అనే రైతు ఇంట్లోకి వెళ్లాడు. కాంగ్రెస్‌ అగ్రనేత రావడంతో ఆ రైతు కుటుంబం ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయింది. దాదాపు వారితో కలిసి అరగంట గడిపారు. ఆ రైతు ఇచ్చిన టీని తాగి అనంతరం పాదయాత్ర కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+