దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కీలక మార్పులు - రైళ్లు, ప్రయాణాలు ఇక నుంచి..!!
తెలుగు రాష్ట్రాల పరిధిలోని రైల్వే నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త గా విశాఖ జోన్ విధులు ప్రారంభించనుంది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి కుదింపు.. ప్రస్తుత డివిజన్ల విభజన పైన తుది కసరత్తు కొనసాగుతోంది. కొత్త జోన్‌కు విభాగాధిపతుల నియామకాలను రైల్వే బోర్డు చేపట్టింది. సంక్రాంతికి అపాయింటెడ్ డే ప్రకటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తుది కసరత్తు
దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ వేగవంతం అయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ సంక్రాంతి నాటికి విధులు ప్రారంభించనుంది. ఇప్పటికే జోన్ కార్యకలాపాల కోసం పలువురు సీనియర్ అధికారులను నియమించింది. ఇక, పీహెచ్‌ఓడీల నియామకం పూర్తి కాగానే దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా కొత్త జోన్ ఏర్పాటుపై నోటిఫికేషన్ రానుంది. ఇది ఆగస్టు నెలాఖరులోగా లేదా సెప్టెంబరు తొలి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తరువాత సంక్రాంతి నాడు అపాయింట్‌మెంట్ డేను ప్రకటించేలా కార్యాచరణ ఖరారు చేసారు. ఆ రోజు నుంచి దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా జోన్‌ల కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతాయి.

కీలక నియామకాలు
దీని ద్వారా రైల్వే నిర్వహణకు సంబంధించిన ఆపరేషన్స్, భద్రత, విజిలెన్స్, ఆర్పీఎఫ్, సివిల్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్స్, సిగ్నల్-టెలికాం, పర్సనల్, కమర్షియల్, స్టోర్స్ విభాగాలకు పీహెచ్‌ఓడీలను నియమించాల్సి ఉంది. దీంతో పాటుగా దక్షిణ మధ్య రైల్వేలోని 3 డివిజన్లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా జోన్‌లో కొంతభాగంతో కలిపి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పడనుంది. దక్షిణ మధ్య రైల్వేలో 6 డివిజన్లు మూడుకు పరిమితమవుతాయి. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందెడ్ ఉంటాయి. దక్షిణ కోస్తాలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఉంటాయి. తూర్పు కోస్తాలో ఖుర్దారోడ్, సంబల్‌పూర్‌తో పాటు కొత్త డివిజన్ రాయగడ ఉంటాయి.
పరిధి కుదింపు
రాయచూరు-వాడి సెక్షన్ ప్రస్తుతం గుంతకల్ డివిజన్ పరిధిలో ఉంది. సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలతో కర్ణాటక నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లకు జోన్ ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు రెండు నుంచి ఒకటికి తగ్గుతాయి. యడ్లాపూర్, యెమరాస్‌లోని థర్మల్ పాయింట్లకు బొగ్గురవాణా సులభం అవుతుంది. గుంటూరు డివిజనలో ఉన్న విష్ణుపురం-పగిడిపల్లి, విష్ణుపురం-జానపహాడ్ సెక్షన్లు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ అవుతుంది. సింగరేణి ప్రాంతం నుంచి విష్ణుపురం వరకు బొగ్గు రవాణా నిరంతరాయంగా జరుగుతుంది. కొండపల్లి-మోటుమర్రి సెక్షన్ సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్‌కు బదిలీ అవుతుంది. ఈ మార్పుల ద్వారా సెక్షన్ల నిర్వహణ బాధ్యతల్లో మార్పులు జరగనున్నాయి.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications