తల్లీ బిడ్డల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం - బేబీ బెర్తులు..!!
రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. రైళ్లలో తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు పిల్లల కోసం రైల్వే శాఖ ప్రయోగాత్మకంగా బేబీ బెర్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. లఖ్‌నవూ మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చామని..అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పూర్తి స్తాయిలో అమలు దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.
బేబీ బెర్తులు
రైళ్లల్లో బిడ్డలతో ప్రయాణించే తల్లుల కోసం రైల్వే శాఖ కీలక ఆలోచన చేస్తోంది. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా బెర్తులు బుక్ చేయలేని వారు వారితో దూరపు ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం బేబీ బెర్తుల పైన రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఇదే అంశం పైన రాజ్యసభలో భాజపా ఎంపీ సమర్ సింగ్ సోలంకీ ప్రశ్నించారు. దానికి మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ ''లఖ్‌నవూ మెయిల్‌లో రెండు బేబీ బెర్త్‌లను ప్రయోగాత్మకంగా తీసుకువచ్చాం. ఒక బోగీలో రెండు దిగువ బెర్త్‌లకు వాటిని అమర్చాం. దీనిపై ప్రశంసలు వచ్చాయని చెప్పారు.

ప్రయోగాత్మాకంగా
అయితే సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ప్రయాణికుల బోగీల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అది నిరంతర ప్రక్రియగా రైల్వే మంత్రి వెల్లడించారు. బేబీ బెర్తులనేవి పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినవి. పిల్లలతో చాలా మంది తల్లిదండ్రులు రైళ్లలో దూర ప్రయాణాలు చేస్తుంటారు. చాలా మంతి తల్లులు పిల్లలను తమ బెర్తు పైనే సర్దుబాటు చేసుకుంటూ ప్రయాణం చేస్తారు. దీని వలన ఇబ్బందులు పడుతున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా
ఇప్పుడు రైల్వే శాఖ తాజా ప్రతిపాదనతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రధాన బెర్తుకి ఉన్న బేబీ బెర్తుని పైకి ఎత్తి పిల్లలను దాని మీద పడుకోబెట్టుకోవచ్చు. అవసరం లేనప్పుడు దాన్ని కిందికి మడత పట్టేయవచ్చు. చిన్న పిల్లలను ముఖ్యంగా శిశువును సురక్షితంగా పడుకోబెట్టడానికి ఈ బేబీ బెర్తులు ఉపయోగపడతాయి. ఈ విధానం అమలు పైన ప్రయాణీకుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. ఆచరణాత్మకంగా ఎదురయ్యే సమస్యలను పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిలో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications