విజయవాడ టు అయోధ్య/వారణాశికి వందేభారత్ స్లీపర్, ముహూర్తం- షెడ్యూల్..!!
రైల్వేశాఖ నుంచి కీలక అప్డేట్. తొలి దశ వందేభారత్ స్లీపర్ రైళ్లల్లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. దశల వారీగా మిగిలిన రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం పలు రాష్ట్రాల నుంచి డిమాండ్లు పెద్ద సంఖ్యలో పెండింగ్ లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి మూడు రూట్లలో ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి. కాగా.. తొలి విడతలోనే ఏపీ నుంచి అయోధ్య/ వారణాశికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూట్.. షెడ్యూల్ పైన తుది కసరత్తు జరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే విశాఖ - సికింద్రాబాద్, కాచిగూడ - యశ్వంత్ పూర్, విజయవాడ - చెన్నై, సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైళ్లను ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక, ఏపీ నుంచి దూరపు ప్రాంతా లకు చేరుకునేందుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు పైన తెలుగు రాష్ట్రాల ఎంపీల నుంచి రైల్వే శాఖకు పలు ప్రతిపాదనలు అందాయి. అందులో భాగంగా విశాఖ నుంచి తిరుపతి, విశాఖ నుంచి బెంగళూరు కు వందేభారత్ స్లీపర్ కేటాయించాలని ఇప్పటికే ఎంపీలు నేరుగా రైల్వే మంత్రిని కలిసి వితని పత్రాలు సమర్పించారు.

కాగా, విజయవాడ నుంచి బెంగళూరుకు వందేభారత్ కు ఆమోదం వచ్చినా సాంకేతిక కారణాలతో ఇంకా పట్టాలెక్కలేదు. ఈ రైలును సంక్రాంతి నుంచి ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. అదే విధంగా విజయవాడ నుంచి చెన్నై వరకు నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు రైల్వే అధికారులు పొడిగించారు. ఇక.. వందే భారత్ స్లీపర్ కోసం దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.
కానీ, ఇదే సమయంలో ఏపీ నుంచి అయోధ్య, వారణాసి కి వందేభారత్ స్లీపర్ కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి వచ్చిన వరుస వినతులతో రైల్వే శాఖ తాజాగా తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ కేటాయింపు పైన రైల్వే శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చింది. అందులో భాగంగా తొలిగా విజయవాడ నుంచి అయోధ్య/ వారణాసి వెళ్లే రైలుకు అధికారికంగా ఆమోదం లాంఛనంగా మారింది.
సంక్రాంతి నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్లాలెక్కుతాయని సమాచారం. అదే సమయంలో విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి కి కేటాయింపు పైన ప్రకటన ఉంటుందని సమాచారం. కాగా, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ పైన కసరత్తు జరుగుతోంది. ఈ రైలు ను రెండు విడతల్లోనే ప్రకటన ఉంటుందని ముఖ్య నేతలు చెబుతున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందేభారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయంలోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైలు అందుబాటులోకి వస్తే అయోధ్య, వారణాసి వెళ్లాలనుకునే తెలుగు ప్రజలకు వరంగా మారనుంది.
-
అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి ‘శ్రీరామ యంత్రం’? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications