Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైల్వే టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు, రేపటి నుంచే - ఇక బుకింగ్ ఇలా..!!

రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ రేపు (గురువారం) నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే టికెట్​ బుకింగ్​ కోసం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఇక.. ఇపుడు రిజర్వేషన్ కు సంబంధించి నిబంధనలను కఠినతరం చేసింది. టికెట్ల జారీలో సాధారణ ప్రయాణీకులకు మరింత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయాల అమలుకు సిద్దమైంది.

రైల్వే శాఖ అక్టోబర్​ 1 నుంచి జనరల్ టికెట్ రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలు మార్పు చేసింది. ​ బుకింగ్​ కోసం ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. అప్పటి నుంచి ఐఆర్​సీటీసీతో ఆధార్​ లింక్​ అయిన వారు మాత్రమే మొదటి 15 నిమిషాల్లో టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. అయితే అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ పీరియడ్‌లో (ప్రయాణ తేదీకి 60 రోజుల ముందు) బుకింగ్‌కు సంబంధించి నిబంధనలను రైల్వే శాఖ మరింత కఠినతరం చేస్తోంది. ప్రస్తుతం రిజర్వేషన్ ప్రారంభమైన తరువాత IRCTC వెబ్ సైట్ ద్వారా తొలి 15 నిమిషాల్లో ఆధార్ అథంటికేషన్​ ఉన్న వ్యక్తులకు మాత్రమే రిజర్వేషన్‌ అవకాశం ఉంది. ఈ సమయాన్ని డిసెంబర్‌ 29, 2025 నుంచి నాలుగు గంటల వరకు పెంచింది. అంటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు టికెట్‌ బుక్‌ చేయాలంటే ఆథార్‌ అథంటికేటెడ్‌ అకౌంట్లకే సాధ్యమవుతుంది.

IRCTC has rolled out phased changes to train reservation timings giving Aadhaar check-in users extended booking access

కాగా, టికెట్ రిజర్వేషన్ సమయం 15 నిమిషాల నుంచి 4 గంటలకు పెంచింది. ఇక ఆధార్ అథెంటికేషన్ లేని వినియోగదారులు.. మధ్యాహ్నం 12 తర్వాత టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలు ఉంటుంది. అయితే ఈ సమయాలను కూడా జనవరి 5 నుంచి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు, 12వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు పెంచ నుంది. దీని ద్వారా ఈ సమయాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే టికెట్లు బుక్​ చేసుకోవచ్చు. తత్కాల్ టికెట్లకు (ఆన్‌లైన్) సంబంధించి 2025, జులై 1 నుంచే.. ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. 2025, జులై 15 నుంచే పీఆర్ఎస్ కౌంటర్లు, ఏజెంట్ల ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేసినా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరిగా ఉంది. ఇక పై నిబంధనలన్నీ.. ఆన్‌లైన్ బుకింగ్స్‌కు సంబంధించినవే. ఇవి పీఆర్ఎస్ కౌంటర్ల ద్వారా టికెట్లను బుక్ చేసుకునేందుకు వర్తించవని రైల్వే అధికారులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+