వందే భారత్ డబుల్ డెక్కర్ రైలు వచ్చేస్తోంది - తొలిగా ఈ మార్గంలోనే..!!
రైల్వే శాఖ మరో కొత్త ఆవిష్కరణకు సమాయత్తం అవుతోంది. ఇప్పటికే వందేభారత్, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వందేభారత్ ను దేశ వ్యాప్తంగా విస్తరణ చేస్తున్నారు. వందేభారత్ స్లీపర్ ను చారిత్రక నగరాల మధ్య నడిపేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు వందేభారత్ లో మరో కొత్త సిరీస్ ను తీసుకొస్తోంది. దీని ద్వారా ప్రయాణీకులతో పాటుగా గూడ్స్ రవాణా కు ప్రాధాన్యత ఇచ్చేలా వందేభారత్ డబుల్ డెక్కర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్దం అవుతున్నాయి.
ఇండియన్ రైల్వేస్ ప్రయాణీకుల కోసం మరో కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటి వరకు వందేభారత్ సిట్టింగ్.. వందేభారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ కొత్తగా వందేభారత్ డబుల్ డెక్కర్ రైళ్లను పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందు కోసం కోచ్ ల డిజైన్ తో పాటుగా అన్ని అంశాల పైన అధ్యయనం చేసారు. విమానాల్లో అమలులో ఉన్న బెల్లీ ప్లైట్ విధానాన్ని రైళ్లలోనూ ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ విధానంలో భాగంగా డబుల్ డెక్కర్ వందేభారత్ రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్దమైంది. పైన ప్రయాణికులు, కింద సరుకులు ఒకేసారి తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ డబుల్ డెక్కర్ రైలు గా అందుబాటులోకి రానుంది. ప్రయాణాలతో పాటుగా సరుకు సైతం వేగంగా గమ్య స్థానాలకు చేరటం ద్వారా కష్టమర్లకు ప్రయోజనం.. రైల్వేకు ఆదాయం పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, ఈ ప్రతిపాదన పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి.

తాజా ప్రతిపాదనలు.. తుది నిర్ణయం
తాజాగా రైల్వే బోర్డు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఈ ప్రతిపాదనకు సానుకూలంగా సిఫారసు చేయడం తో ఈ ప్రాజెక్టు ఇక వేగంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం ఈ ప్రతిపాదన మేరకు డబుల్ డెక్కర్ నమూనా రూపొందించారు. అయితే, వందేభారత్ స్లీపర్ ప్రవేశ పెడుతున్న సమయంలో ఈ నమూనాకు బ్రేక్ పడింది. ఇప్పుడు దానిని వందే భారత్ సిరీస్‌లో భాగంగా ప్రవేశపెట్టాలని కమిటీ చేసిన సూచన పైన కసరత్తు జరుగుతోంది. సిద్దం అవుతున్న నమూనా మేరకు ప్యాసింజర్ కమ్ కార్గో డబుల్ డెక్కర్ రైళ్లలో పైడెక్కులో ప్రయాణికుల కోసం వందే భారత్ ఎగ్జిక్యూటివ్ కోచ్ తరహా సౌకర్యాలు ఉంటాయి. దాదాపు 46 సీట్లు, ఒక పాంట్రీ, టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. లోయర్ డెక్ లో గరిష్ఠంగా ఆరు టన్నుల వరకు సరుకును తరలించే అవకాశం ఉంటుంది. ఒక్కో కోచ్ తయారీకి రూ.4.5 కోట్ల వరకు ఖర్ కానుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు అధికారుల కమిటీ సిఫారసు లతో ఈ రైళ్లు ముందుగా అహ్మదాబాద్ - కోల్ కతా మధ్య తొలిగా ప్రవేశ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని పైన త్వరలోనే అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.



Click it and Unblock the Notifications