5 రోజులు ఏపీని తీవ్రంగా హెచ్చరించిన వాతావరణశాఖ
రోహిణీకార్తెలో ఎండ వేడికి మలమల మాడిపోయిన ప్రజలకు వాతావరణశాఖ చల్లటి శుభవార్తను వినిపించింది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో వాతావరణం చల్లగా మారడంతోపాటు కొద్దిరోజులుగా సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లో మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం సమయంలో కొద్దిరోజులుగా నల్లటి మేఘాలు కమ్ముకొని తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.

నగరంలో పరిశీలన
హైదరాబాద్ నగరంలో మాత్రం ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. దీంతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్ అధికారులు ఎక్కడికక్కడ నాలాలు ఏమైనా ప్రమాదకరంగా ఉన్నాయేమోనని నగరమంతటా తిరిగి పరిశీలిస్తున్నారు. వాతావరణశాఖ కూడా హైదరాబాద్ కు భారీ వర్షాలు చెబుతుండటంతో నగరంలో ట్రాఫిక్ జామ్ విపరీతంగా అవుతోంది. మ్యాన్ హోల్స్ లో చెత్త, చెదారం ఏమీ లేకుండా చర్యలు చేపడుతున్నారు. రోడ్లపై వెళ్లే సమయంలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలి
వర్షాలు పడుతున్న సమయంలో విద్యుత్తు స్తంభాలకు దూరంగా ఉండాలని రోడ్లపై చెట్లు పడిపోతే వెంటనే జీహెచ్ ఎంసీ అధికారులకు ఫోన్ చేయాలని, వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ టీం అప్రమత్తమవుతుందని చెబుతున్నారు. సాయంత్రం సమయంలో ఒకేసారి అందరూ ఇళ్లకు వెళ్లేందుకు బయటకు వస్తున్నారని, వర్షం వల్ల తీవ్రంగా ట్రాఫిక్ జాం అవుతోందని, ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ గా ఉండాలని, సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ లేకుండా చూడాలని అధికారులు పోలీసులను కోరుతున్నారు. వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications