దళిత డిప్యూటీ స్పీకర్‌పై చించి విసిరేస్తారా: రాజయ్య

శాసనసభలో సీమాంధ్ర శాసనసభ్యుల ప్రవర్తన బాధాకరమని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్‌పై దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు.
శాసనసభ్యుల అనుచిత ప్రవర్తనను తాము ఖండిస్తున్నట్లు ఆయన తెలిపాుర. అనుచిత వైఖరికి పాల్పడిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు సీట్లోనే కూర్చున్నారని, చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమైనప్పుడు సభను వాయిదా వేశారని ఆయన అన్నారు.చంద్రబాబు సభలో లేరంటూ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బిల్లుపై పెద్దగా చర్చించేదేమీ లేదని, వారం రోజుల్లో పూర్తి చేసి తిరిగి పంపించేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications