పిలిచారా, వెళ్లారా?: బర్తరఫ్ తర్వాత తొలిసారి కేసీఆర్‌తో రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య సోమవారం నాడు కలిశారు. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయిన తర్వాత రాజయ్య తొలిసారిగా కేసీఆర్‌ను క్యాంప్ ఆఫీసులో కలిశారు.
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుండి తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఆ తర్వాత రాజయ్య ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింటుమెంట్ లభించలేదు. ఇప్పుడు ఆయన కలిశారు.

తనకు ముఖ్యమంత్రి నుండి పిలుపు వస్తే కలుస్తానని రాజయ్య కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనే కలిశారా లేక కేసీఆర్ పిలిచారా అనే చర్చ సాగుతోంది. అయితే, రాజయ్యనే కలిసి ఉంటారంటున్నారు. కాగా, కేసీఆర్‌ను కలిసిన అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. తాను కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పారు.
రేపు, ఎల్లుండి కలెక్టరేట్‌ల ముట్టడి: టీఎన్‌ఎస్‌ఎఫ్ ఇంఛార్జ్
సీఎం కేసీఆర్ ఎనిమిది నెలల పాలనలో ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలు వచ్చాయని టీఎన్‌ఎస్‌ఎఫ్ ఇన్‌చార్జ్ మదనమోహన రావు ఆరోపించారు. నిరుద్యోగుల తరుపున రేపు, ఎల్లుండి కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహిస్తామని, ఈనెల రెండో వారంలో ఇందిరాపార్క్ వద్ద మహధర్నా చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications