'కెసిఆర్‌కు ఎన్టీఆర్ నేర్పారని బాబు అన్నారు': వైఎస్ విగ్రహానికి పుష్కర స్నానం

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనని మాటలను అన్నట్టుగా చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేసీఆర్‌కు ఉదయాన్నే లేచే అలవాటు నేర్పింది ఎన్టీఆరే అని చంద్రబాబు గుర్తు చేశారు.

ఆంధ్రా వారిది పేడ బిర్యానీ అని, దొంగలు దోపిడీదారులన అన్నప్పుడు కేసీఆర్‌కు సంస్కారం గుర్తుకు రాలేదా అని రాజేంద్రప్రసాద్‌ ప్రశ్నించారు. కాల్‌డేటాపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపైఆయన హర్షం వ్యక్తం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై త్వరలో వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో 20 వేల మంది రైతులు మరణించారని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. తెలుగు జాతికి అన్యాయం చేసిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా క్షమాపణ చెప్పాలని రాజేంద్రప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో రాహుల్ గాంధీ పర్యటించాలని ఆయన అన్నారు.

Rajendra Prasad retaliates KCR comments

ఇదిలావుంటే, పెనుగొండ మండలం సిద్ధాంతం కేధార్‌ఘాట్‌లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వైఎస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమండ్రిలో వైఎస్ విగ్రహానికి పుష్కరస్నానం చేయించారు. అనంతరం వైఎస్ పేరుమీద పిండప్రదానం చేశారు.

తరతరాలు గుర్తుంచుకోదగిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. వైఎస్ విగ్రహానికి పుష్కరస్నానం చేయించడం ఎంతో సంతోషంగా ఉందని వైసీపీ నేతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+