వెంకయ్యకు పదవిపై రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు..!!
వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం పై రజనీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఉపాధ్యక్ష పదవిపై సూపర్ స్టార్ రజనీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తాను రాజకీయాలకు దూరంగా ఉండటం వెనుక కారణాలను రజనీ కాంత్ వెల్లడించారు. రజనీకాంత్ కు రాజకీయాల్లో ఎంట్రీ పైన తాను ఇచ్చిన సలహా ఏంటో వెంకయ్య నాయుడు అదే వేదిక పైన బయట పెట్టారు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వెంకయ్యకు ఆ పదవి నాకు నచ్చలేదు
చెన్నైలో ఓ కార్యకమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు..సూపర్‌స్టార్ రజినీకాంత్ ఇద్దరూ కీలక వ్యాఖ్యలు చేసారు. వెంకయ్యకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వటం పైన రజనీకాంత్ తన మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టారు. వెంకయ్య నాయుడికి భారత ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు.
గొప్ప నాయకునిగా పేరు తెచ్చుకున్న వెంకయ్య నాయుడును రాజకీయా నుంచి దూరం చేశారని ఆరోపించారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవని, ఆయన మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగితే ఎంతో బాగుండేదని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి పదవిని ఇచ్చి రాజకీయాలకు దూరం చేయడం తనకు నచ్చలేదన్నారు.

ఆ సమస్యతోనే రాజకీయాలకు దూరం
తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి..దూరం కావటం పైనా రజనీ క్లారిటీ ఇచ్చారు. అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ మూడు పేజీల స్టేమెంట్ గతంలోనే విడుదల చేశారు రజిని. తాజాగా మరోసారి తమరాజకీయం పై స్పందించారు. మూత్రపిండాల సమస్య చికిత్స వేళ రాజకీయాలపై నిర్ణయం తీసుకున్నా.. డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా మేరకు కార్యక్రమాల్లో ఎక్కవ పాల్గొనకూడదని విరమించుకున్నా.. మూత్ర పిండాల సమస్యతోనే రాజకీయాలకు దూరం అయ్యానని చెప్పారు.
బహిరంగ సభల్లోనూ పాల్గొన లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొంత మంది తాను రాజకీయాలకు భయపడి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం చేసారని గుర్తు చేసారు. అదే సమయంలో దేవుడు లేడు అనీకొందరు అంటుంటే ఏమనాలో అర్థంకావడంలేదని అన్నారు. అలాంటివారు రక్తం తయారుచేయగలరా అని ప్రశ్నించారు.

రాజకీయాల్లోకి వద్దని వెంకయ్య సలహా
ఇదే వేదిక పైన వెంకయ్య మరో కీలక అంశం బయట పెట్టారు. రాజకీయాల్లోకి రావద్దని రజనీకాంత్ కు తాను హితవు పలికినట్లు వెంకయ్య వెల్లడించారు. ఆ సమయంలో ఆయన తనను అపార్దం చేసుకున్నారని వివరించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే విషయం తెలిసి వద్దని చెప్పినట్లు వెల్లడించారు. ప్రజలకు సేవ చేసేందుకు మెరుగైన మార్గాలు ఉన్నాయని తెలియజేసినట్లు పేర్కొన్నారు.
అయితే, వెంకయ్య నాయుడకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వటం ద్వారా ఆయనను క్రియాశీల రాజకీయాలకు దూరం చేసారంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఉపరాష్ట్రపతి పదవి పూర్తయిన తరువాత ప్రమోషన్ దక్కాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. కానీ, వెంకయ్య నాయుడు తాను ఏ పదవి కోరుకోలేదని..తన వద్దకే పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం చర్చకు కారణమైంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications