మరోసారి చిక్కుల్లో రమణ దీక్షితులు: సురేష్ రెడ్డి మనవరాలికి ఆశీస్సులు

ఓ పనిపై ఇక్కడి వచ్చిన రమణదీక్షితులు తమ మనవరాలుకు ఆశీర్వచనాలు అందజేశారని సురేష్‌రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. గతంలో కూడా రమణ దీక్షితులు ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లకు వెళ్లి ఆయా వ్యక్తులకు ఆశీర్వచనాలు అందించిన విషయం తెలిసిందే.
గతంలో ఓ పారిశ్రామికవేత్త కుమారుడికి ఆయన ప్రైవేట్ ఆశీస్సులు అందించారు. ఆ పారిశ్రామికవేత్త ఉంటున్న అతిథి గృహానికి వెళ్లి అర్చన చేసి ఆశీస్సులు అందజేశారు. ఈ సంఘటన ఆదివారంనాడు జరిగింది. కెమెరామెన్ ఆ సంఘటనను చిత్రీకరించడానికి ప్రయత్నించారు. దాంతో ఆయన కారులో ఎక్కి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
రమణదీక్షితులు వివాదంలో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆలయ నిబంధనలను అతిక్రమించి ఓ పారిశ్రామికవేత్త అతిథి గృహంలో కార్యక్రమాలు నిర్వహించినందుకు 2010 ఏప్రిల్ 10వ తేదీన ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికార యంత్రాంగం మెమో జారీ చేసింది. పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, సినీ తారలతో, సెలబ్రిటీలతో ఆయన భుజం భుజం రాసుకంటూ తిరుగుతారనే అభిప్రాయం ఉంది. ప్రధానార్చకుడిగా రమణదీక్షితులు స్వామి సేవలో మాత్రమే ఉండాలని అంటారు.
ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఆలయ ఆచారాలు, సంప్రదాయాలకు కట్టుబడి స్వామివారి సేవకు మాత్రమే అంకితం కావాలని పండితులు అంటున్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి, వైయస్ జగన్‌కు రమణదీక్షితులు 2009లో తిరుమలలో సుదర్శన హోమం నిర్వహించారని తిరుమల ఆలయ సంరక్షణ సమితికి చెందిన నరేంద్ర గతంలో ఆరోపించారు.












Click it and Unblock the Notifications