తెలుగులో రాందేవ్ బాబా, బాబుకి ప్రశంస: ఎన్నికల గురించి ఆలోచించడని..
రాజమండ్రి: యోగా గురువు రాందేవ్ బాబా శనివారం నాడు రాజమహేంద్రవరంలో పుష్కర స్నానం ఆచరించారు. గోదావరి పుష్కరాలు 2015 తుది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు కితాబిచ్చారు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో రాందేవ్ బాబా మాట్లాడారు. ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. మహా పుష్కరాల్లో పుణ్యస్నానాలకు చంద్రబాబు ఆహ్వానించారని, అందరికీ ప్రణామాలు అని పేర్కొన్నారు.
అనంతరం మాట్లాడుతూ... గోదావరి పుష్కరాలు దక్షిణాది కుంభమేళా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, 25మంది ముఖ్యమంత్రులు తనకు తెలుసునని చెప్పారు. చంద్రబాబుతో గత పదేళ్లుగా తనకు పరిచయముందన్నారు.

రాందేవ్ బాబా
ఆధునికత, ఆధ్యాత్మికత ఉన్న నేత చంద్రబాబు అని కొనియాడారు. అన్ని మతాలను గౌరవించడంతో పాటు, జాతీయ భావాలు, దార్శనికత ఆయనలో ఉన్నాయని చెప్పారు.

రాందేవ్ బాబా
యోగాల్లో కర్మ యోగం, ధర్మ యోగం ఉండాలన్నారు. అవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో ఉన్నాయన్నారు.

రాందేవ్ బాబా
కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠానికి చెందిన స్వామి నిర్మలానంద కూడా చంద్రబాబుకు కితాబిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆధ్యాత్మిక భావాలు చంద్రబాబులో ఉన్నాయన్నారు.

రాందేవ్ బాబా
రాబోయే ఎన్నికల గురించి కాకుండా, రాబోయే తరం గురించి ఆలోచించే రాజనీతిజ్ఞత ఆయనదన్నారు. ఆధునికత, ఆధ్యాత్మికతల మేళవింపుతో కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications