హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రమేష్ ఆత్మహత్య: అక్రమ కట్టడాల కూల్చివేతకు బ్రేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగి రమేష్ ఆత్మహత్యతో హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మంగళవారంనాడు తాత్కాలికంగా నిలిపివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) అధికారులు నిర్ణయించారు.

స్థల వివాదం కారణంగా సరూర్‌నగర్ పరిధిలోని పి అండ్ కాలనీలో సోమవారం ఆర్టీసీ ఉద్యోగి రమేష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. దీంతో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో అధికారులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో అవినీతి పెరిగిందని రమేష్ తన సూసైడ్ నోట్‌లో ఆరోపించాడు.

Ramesh suicide effect: Dismantling stopped

జీహెచ్ఎంసీ అధికారులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని తన సూసైడ్ నోట్‌లో రమేష్ కోరారు. దీంతో రమేష్ ఆత్మహత్యకు గల కారణాలపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు నివేదించనున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాత్కాలికంగా కూల్చివేతలు నిలిపివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

భూకబ్జాదారులతో జిహెచ్ఎంసీ ఉద్యోగులు కుమ్మక్కయి తన స్థలాన్ని లాక్కోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, బిహెచ్ఇఎల్ ఐఎంజి ఫేజ్ వన్‌లో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది.

English summary
GHMC officials stopped dismantling of illegal constructions with the effect of RTC employe Ramesh suicide in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X