కాంగ్రెసు బుజ్జగింపు: కిరణ్ రెడ్డికి రాయపాటి షాక్

Rayapati Sambasiva Rao
గుంటూరు: 'జై సమైక్యాంధ్ర' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన కిరణ్‌ కుమార్ రెడ్డికి కాంగ్రెసు బహిష్కృత నేత రాయపాటి సాంబశివరావు షాక్ ఇచ్చారు. కిరణ్‌ కుమార్ రెడ్డితో నడిచే వారిలో రాయపాటి పేరు మొదటి నుంచీ వినిపిస్తూ వచ్చింది. హైదరాబాద్‌కు రావడంలో ఆలస్యం కావడంవల్లే తన మీడియా సమావేశానికి రాయపాటి రాలేకపోయారని పార్టీ ఏర్పాటు గురించి ప్రకటించినప్పుడు కిరణ్ తెలిపారు.

కొత్త పార్టీలో చేరడంపై రాయపాటి తన మనసు మార్చుకున్నట్లు తెలిసింది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరే విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. మనసు మార్చుకోవడం వ్లలనే సోమవారం ప్రకటించిన జై సమైక్యాంధ్ర పార్టీ కమిటీలో రాయపాటి పేరు కనిపించలేదని అంటున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ గురించి ఆయనకంటే రాయపాటి సాంబశివ రావు ఎక్కువగా మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడుతున్నారంటూ పదే పదే చెబుతూ వచ్చారు. పార్టీ పెట్టే సమయానికి మాత్రం దూరంగా జరిగారు సన్నిహితులు, అనుచరుల ఒత్తిడి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.

గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని తొలుత భావించారు. రాయపాటి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడంతో ఆ అవకాశాన్ని గల్లా జయదేవ్ తన్నుకుపోయారు. ఇక నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తే టిడిపిలో చేరాలని, లేకుంటే తిరిగి కాంగ్రెస్ గూటికే చేరాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాయపాటిని త్వరలోనే కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. దీనికోసం తెలంగాణకు చెందినన వి. హనుమంతరావు ద్వారా మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే రాయపాటి శిష్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ రాహుల్‌ని కలిసి, బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+