చంద్రబాబుకు రాయపాటి తాజా డిమాండ్ -వాళ్లకు టికెట్ ఇస్తే కుదరదు..!!

టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఇప్పటికీ ఎన్నికల్లో పోటీకి సిద్దమేనని ప్రకటించారు. నరసరావుపేటలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసారు. కడప..కర్నూలు జిల్లాకు చెందిన వారికి ఇస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. తన కుమారుడుకు సీటు ఇవ్వాలని కోరారు. తన కుటుంబంలో రెండు సీట్లు ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని షరతు పెట్టారు. 2024లో టీడీపీ వేవ్ ఉందని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

రాయపాటి కొత్త డిమాండ్:మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లా రాజకీయాలపైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసిన రాయపాటి ఇప్పుడు మరోసారి టికెట్ల కేటాయింపు పైన కామెంట్స్ చేసారు. కన్నాతో రాజీ లేదు ఏం లేదన్న రాయపాటి తనను ఆయన పదేళ్లు వేధించారని చెప్పుకొచ్చారు. పార్టీ కోసం, చంద్రబాబు కోసం ఆయనతో కలిసి పోటీ చేస్తానని స్పష్టం చేసారు. రాబోయే ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుస్తారంటూ రాయపాటి చెప్పుకొచ్చారు. 2019లో జగన్ వేవ్ కంటే ఇప్పుడు టీడీపీ వేవ్ ఎక్కువగా ఉందన్నారు. జగన్ పాలనతో ప్రజలు విసిగివేశారనని రాయపాటి వ్యాఖ్యానించారు.

Rayapati Sambasiva Rao demands two tickets for his family

లోకల్ కే సీటు ఇవ్వాలి:నరసరావుపేట నుంచి 2014లో ఎంపీగా గెలిచిన రాయపాటి 2019లో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశిస్తే తాను తిరిగి నరసరావు పేట నుంచి పోటీకి సిద్దమేనని ప్రకటించారు. నరసరావుపేటలో స్థానికులే అభ్యర్ధులుగా ఉండాలన్నారు. కడప, కర్నూలు నుంచి వస్తే కుదరదని కీలక వ్యాఖ్యలు చేసారు. స్థానికులు ఎవరు పోటీ చేసినా తాను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పారు. గుంటూరు జిల్లాలో అభ్యర్ధులు లేకపోతే కదా వేరే ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిందని వ్యాఖ్యానించారు. మాచర్లలతో బ్రహ్మారెడ్డి గెలుస్తారని రాయపాటి జోస్యం చెప్పారు. తన కుమారుడుకు టికెట్ ఇవ్వమని కోరుతున్నట్లుగా రాయపాటి చెప్పుకొచ్చారు.

రెండు సీట్లు కోరిన రాయపాటి:తన కుమారుడుకు పెదకూరపాడు ఇస్తారా, సత్తెనపల్లి ఇస్తారా అనేది చంద్రబాబు ఇష్టమని చెప్పారు. తన తమ్ముడు కుమార్తె రాయపాటి శైలజకూ టికెట్ ఇవ్వాలని రాయపాటి కోరారు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయటానికి సిద్దమని స్పష్టం చేసారు. నరసరావు పేట నుంచి కడప జిల్లాకు చెందిన నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు టీడీపీ ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దిగే అవకాశం ఉందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. బీసీ అభ్యర్దిని అక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు రాయపాటి ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నారు. రాయపాటి కోరుతున్న విధంగా ఆయన కుమారుడికి సీటు..కుటుంబానికి రెండు సీట్ల విషయంలో చంద్రబాబు స్పందన కీలకం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+