జగన్ ఇలా చెయ్, నువ్వు మారకుంటే లోకేష్ ముఖ్యమంత్రి: రాయపాటి

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివ రావు పలు సూచనలు చేశారు. జగన్ మారాల్సిన సమయం వచ్చిందని, లేదంటే లోకేష్ అధికారంలోకి వస్తారన్నారు.

కేశినేని నానిని కొట్టి సారీ చెబుతా, 'నారాయణ'లోనే లీక్, వారు మాఫియా: కోటంరెడ్డి

సోదరా జగన్! నువ్వు మారాల్సిన సమయం వచ్చింది అని రాయపాటి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మంచి పనులను పొగుడు, చెడును విమర్శించు అంతే కానీ ప్రభుత్వం ఏం చేసినా విమర్శించ వద్దని హితవు పలికారు.

ys jagan - nara lokesh

నీ సభలకు వచ్చే జనాలంతా నీపై అభిమానంతో రావడం లేదని గుర్తించాలన్నారు. మీ నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానం, ప్రేమతో వారు నీ వద్దకు వస్తున్నారని చెప్పారు.

చెవిరెడ్డి అరెస్ట్‌కు అనుమతి తీసుకున్నారా?: పోలీసుల తీరుపై చంద్రబాబు!

మళ్లీ ఎన్నికల సమయానికి తమకు ఎవరు మంచి చేస్తే వారినే వారు ఎన్నుకుంటారన్న విషయం జగన్ గుర్తించాలన్నారు. అందుకే విమర్శించాల్సిన సమయంలో విమర్శించినా, ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు తెలపాలన్నారు. లేదంటే అధికారంలోకి రావాలన్న నీ కల కలగనే మిగులుతుందని, నీ స్థానంలో లోకేష్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MP Rayapati Sambasiva Rao said that YSRCP chief YS Jaganmohan Reddy should change his attitude.
Please Wait while comments are loading...