బాబు పట్టుతో ఏపీకి ఆఫర్, టీకి ఊరట: సభకి 'పోలవరం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రుణాల రీషెడ్యూల్‌కు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించడం.. తెలంగాణకు కూడా ఊరట కలిగించే అంశం. ఎన్నికల ప్రచారం సమయంలో... రైతుల రుణమాఫీ పైన తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు నాయుడులు హామీ ఇచ్చారు. అయితే, రుణమాఫీకి ఆర్బీఐ ఒప్పుకోవడం వంటి పలు చిక్కులు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ రావడంతో రుణాల రీషెడ్యూల్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం రీషెడ్యూల్ పైన దృష్టి సారించి ఆ తర్వాత రుణమాఫీ పైన ఆర్బీఐ, కేంద్రంకు విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూలో కోసం చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు.
ఇందులో భాగంగా మంగళవారం ఆయన ఆర్బీఐ గవర్నర్‌కు ఫోన్ చేసి రీషెడ్యూల్ చేయాలని కోరారు. దీంతో ఆర్బీఐ గవర్నర్ అంగీకరించారు. ఏపీలో రీషెడ్యూల్‌కు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించిన నేపథ్యంలో తెలంగాణలోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ఏపీలో రీషెడ్యూల్‌కు అంగీకరించినందున తెలంగాణ ప్రభుత్వం కూడా ఆర్బీఐతో మాట్లాడి రీషెడ్యూల్ కోరే అవకాశముంది.

మంగళవారం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడుతూ... రుణాల రీషెడ్యూల్‌కు ఆర్బీఐ గవర్నర్ అంగీకరించారని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో తీసుకోవాల్సిన చర్యల పైన చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు. రుణాల రీషెడ్యూల్ వల్ల ఖరీఫ్ రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.
రెండు నెలల్లో విద్యుత్ లోటును అధిగమిస్తామని తెలిపారు. రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులపై రుణభారం లేకుండా చూడాలనేదే తమ విధానమన్నారు. బోధన రుసుంపై ఏపీ విద్యార్థులకు ఆందోళన వద్దన్నారు. ఆధార్ కార్డు లేని వారికి ఇప్పించే ఏర్పాట్లు చేస్తామని, ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇచ్చిన హామీలనన్నింటిని నెరవేరుస్తామన్నారు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు.
పోలవరం రగడ
పోలవరం అంశం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలను పెంచుతోంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తెరాస, ఒడిశా ఎంపీల నిరసనల మధ్య పోలవరం బిల్లును ప్రవేశ పెట్టారు. రాజ్ నాథ్ బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో తెరాస ఎంపీల నిరసనకు ఒడిశా ఎంపీలు జత కలిశారు. నిరసనల మధ్యే... పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపే బిల్లును రాజ్‌నాథ్ ప్రవేశ పెట్టారు.












Click it and Unblock the Notifications