చంద్రబాబు, డీజీపీ దెబ్బ, పోలీసు కస్టడీలో ఇద్దరు ఆర్డీఓలు, పెద్దిరెడ్డికి షాక్
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి మంటలు వ్యాపించి కీలకమైన రికార్డులు కాలిపోయాయి. ఈ ఘటనను సోమవారం పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇది ప్రమాదం కాదని, కావాలనే కొందరు నిప్పంటించి ఉంటారనే అనుమానాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరో ఉద్దేశపూర్వకంగా కాల్చేశారని, దీనివెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు అర్థమవుతుందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అనుమానం వ్యక్తం చేశారు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11.24 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలోని 22ఏ సెక్షన్‌లో మంటలు వ్యాపించాయి. దాదాపు 25 విభాగాల్లోని రన్నింగ్ ఫైళ్లు దగ్ధమయ్యాయి. అయితే అగ్నిప్రమాదానికి కరెంటు షార్ట్ సర్క్యూట్ కారణం అని తొలత భావించినప్పటికీ అది నిజం కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది.

ఈ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హెలికాఫ్టర్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు డీజీపీ సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించారు. చివరకు ఇది ప్రమాదం కాదని, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటన అని డీజీపీ ద్వారాక తిరుమలరావు తేల్చారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం, అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే మంటలు వ్యాపించడం అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాబి ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాయలంలో జరిగిన అగ్నిప్రమాదంలో కీలక ఫైళ్ల దగ్ధంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
ఈ ఘటనపై చంద్రబాబుఒక్కరోజులోనే మూడు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. చంద్రబాబు స్వయంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగి అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డీజీసీ ద్వారకా తిరుమలరావు స్వయంగా పరిశీలించిన కొన్ని గంటల్లోనే పోలీసులు అలర్ట్ అయ్యారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఆర్డీఓ హరిప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఆర్డీఓ హరిప్రసాద్ నివాసం ఉందని, అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసినా ఆ విషయాన్ని కలెక్టర్ కు, ఉన్నతాదికారులకు సమాచరం ఇవ్వకుండా ఆర్డీఓ హరిప్రసాద్ నిర్లక్షం చెయ్యడం అనేక అనుమానాలకు దారితీస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మీడియాకు చెప్పారు. ఇదే సమయంలో గతంలో మదనపల్లె ఆర్డీఓగా పని చేసిన మురళి కూడా ఆదివారం మదనపల్లెలో ప్రత్యక్షం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.
గతంలో ఆర్డీఓగా పని చేసిన మురళి మదనపల్లె చేరుకుని ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్ ను కలిసి చర్చలు జరపడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ప్రమాదం జరిగిన రోజు పాత ఆర్డీఓ మురళి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మొత్తం మీద ఆర్డీఓలు మురళి, హరిప్రసాద్ ను పోలీసు అధికారులు మదనపల్లెలోని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications