ఆదిపురుష్ తో బాకీలు తీర్చేసిన ప్రభాస్?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'ఆదిపురుష్' విడుదలకు సిద్ధమవుతోంది. బిజినెస్ లెక్కలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో భారీస్థాయిలో వ్యాపారం జరుగుతోంది. గతంలో ఏ చిత్రం విడుదల కానటువంటి రీతిలో అత్యధిక స్క్రీన్లపై ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. రామాయణ గాథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రానికి ఓంరౌత్ దర్శకుడు.
ఆదిపురుష్ సినిమా వ్యాపారం భారీగా జరుగుతున్న సమయంలో ప్రభాస్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చివుంటారనే సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. అయితే డబ్బులుగా కాకుండా వాటా రూపంలో ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. నిర్మాతలు ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు ప్రభాస్ కు ఇచ్చేశారని, ప్రభాస్ వాటిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

యూవీ క్రియేషన్స్ మొదట ఆదిపురుష్ హక్కులు తీసుకోవాలనుకుంది. అయితే ఇటీవల ఈ సంస్థ నిర్మించిన సినిమాలు కొన్ని ఫ్లాపవడంతోపాటు కొంతమంది అమౌంట్ సెటిల్ చేయాల్సి ఉండటంతో సంస్థ ముందుకు రాలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి దాదాపు 170 కోట్లరూపాయలకు హక్కులు అమ్మేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఆదిపురుష్ సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.170 కోట్లు. ఈ సంస్థ నుంచి వచ్చిన మొత్తంలో దాదాపు 100 కోట్లరూపాయలు యూవీ క్రియేషన్స్ కు ఇచ్చారని తెలిసింది. కొన్నిరోజులుగా ఈ సంస్థకు పాత అప్పులు ఉండటంతో వాటిని సంస్థ తీర్చేసింది.
నిర్మాత దిల్ రాజుకు ఒక్కడికే రూ.40 కోట్లు ఇవ్వాల్సి ఉంది. సింగిల్ పేమెంట్ లో దాన్ని సెటిల్ చేశారని తెలిసింది. అంతేకాకుండా బయ్యర్లకు ఇవ్వాల్సినవి, ఇతరత్రా ఉన్నవన్నీ కలిపి అప్పులు తీర్చేసినట్లు తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ కు సొంత సంస్థ. అలాంటి సంస్థ అప్పులు తీర్చేశాడంటే తన అప్పులు తాను తీర్చుకున్నట్లేనని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.












Click it and Unblock the Notifications