అమిత్ షా తో రఘురామ భేటీ : ఎంపీ వర్సెస్ వైసీపీ నేతలు : ఎత్తులు-పై ఎత్తులు..!!
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఏపీ ఎంపీల మధ్య ఆసక్తి కర రాజకీయం చోటు చేసుకుంటోంది. ఎలాగైనా రఘురామ మీద అనర్హత వేటు పడాల్సిందేనంటూ వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు స్పీకర్ ను కలవటంతో అనర్హత పిటీషన్ పైన సమాధానం కోరుతూ స్పీకర్ కార్యాలయం రఘురామ కు నోటీసులు జారీ చేసింది. ఇక, ఇదే సమయంలో వైసీపీ ఎంపీలు మరింత గా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్రహోంమంత్రి అమిత్ షాతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు.

అమిత్ షా తో రఘురామ చర్చలు
ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ సమావేశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్యం పరిస్థితులపై అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చిన సమయంలో అమిత్ షా తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ సమయంలో రఘురామ రాజు అంశం సైతం చర్చకు వచ్చినట్లుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ వైసీపీ ఆందోళన కొనసాగుతోంది. ఏకంగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి గతం కంటే భిన్నంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. కేంద్రానికి తాము ఎంత సపోర్ట్ గా ఉన్నా..కేంద్రం మాత్రం ఆ స్థాయిలో తమకు సహకారం అందించటం లేదనే అభిప్రాయం వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ ఫ్లాష్ నిరసనల వెనుక
ఇక, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలోనే రఘురామ రాజుకు ఇచ్చిన నోటీసు సమయం పూర్తి కానుంది. ఆయన ఆ నోటీసుకు సమాధానం ఇస్తారా లేక.. మరింత సమయం కోరుతారా అనేది ఆసక్తి కరమే. ఇదే సమయంలో రఘురామ రాజు టీవీ ఛానళ్లు..చంద్రబాబు- లోకేష్ తో కలిసి కుట్రలు చేసారంటూ సీఐడీ విచారణలో తేలిన అంశాలను సుప్రీం కోర్టులో కౌంటర్ అఫిడవిట్ రూపంలో ఫైల్ చేసారు. అందులో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ రఘురామ రాజు టీడీపీ అధినేత చంద్రబాబుతో షేర్ చేసుకున్నట్లుగా..వారి మధ్య జరిగిన ఛాటింగ్ సైతం జగన్ మీడియాలో బయటకు వచ్చింది.

హోం మంత్రి భేటీతో మరింత ఆసక్తి కరంగా..
అయితే, దీని పైన రఘురామ రాజు భిన్నంగా స్పందించారు. ఈ కేసు కొనసాగిస్తూనే...రాకీయంగా రఘురామ రాజు ఎంపీగా కొనసాగకుండా చూడాలని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆలోచన చేస్తోంది. ఇక, సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పైన తీర్పు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. రఘరామ రాజు పైన వేటు ఖాయమని వైసీపీ నేతలు చెబుతుంటే...తన పైన అనర్హత సాధ్యం కాదని ...వేటు పడటం కల అంటూ రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రఘురామ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ అవ్వటం రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications