హరికృష్ణ వ్యాఖ్యలు ఎవరిపై..: అసలేమైంది, ఎన్టీఆర్ వల్లనేనా...
హరికృష్ణ తాజా వ్యాఖ్యతో మరోసారి చంద్రబాబుకు, ఆయనకు మధ్య గల విభేదాలపై, టిడిపిలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ సాగుతోంది.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు, ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తాజాగా వ్యాఖ్యలు మరోసారి పార్టీ పరిణామాలపై చర్చకు దారి తీయించింది. నిజాలు మాట్లాడడం వల్లనే తనను వెనక్కి నెట్టారని ఆయన అన్నారు. అసలు తనను ఎవరు వెనక్కి నెట్టారనే విషయాన్ని ఆయన తేల్చలేదు. కానీ, అందరి దృష్టి మాత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన బావ నారా చంద్రబాబు నాయుడిపై పడింది.
హరికృష్ణ, చంద్రబాబు నాయుడికి రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా కూడా దూరం పెరిగినట్లు అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించే సమయంలో నందమూరి, నారా కటుంబ సభ్యులు కలవడం లేదు. ఎవరికి వారి వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు ఆయన పూర్తిగా దూరమైనట్లే అంటున్నారు. ఆయన తండ్రి హరికృష్ణ కూడా పార్టీ కార్యక్రమాల పట్ట అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు.

నారా, నందమూరి వంశాల మధ్య వైరం
ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వారసత్వం ఎవరిదనే విషయంపై నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు పొడసూపాయి. ఎన్టీ రామారావు నుంచి ప్రభుత్వాన్ని, పార్టీని సొంతం చేసుకునే సమయంలో చంద్రబాబుకు నందమూరి హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు సహకరించారు. కానీ, త్వరలోనే అసంతృప్తికి గురై బయటకు వచ్చారు. అయితే, దగ్గుబాటి వెంకటేశ్వర రావు దూరంగానే ఉంటూ వచ్చారు గానీ హరికృష్ణ మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యారు. రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

జూ. ఎన్టీఆర్ ప్రవేశం...
చంద్రబాబు నాయుడు కొంత కాలం జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకున్నారు. ఆయన పెళ్లి విషయంలో కూడా చంద్రబాబుదే ప్రధాన పాత్ర అంటారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్దమయ్యారు. ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. సీనియర్ ఎన్టీఆర్‌ను ఆయన తలపించారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, పార్టీ ఆ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఓటమికి కారణాలు ఏమైనా, జూ. ఎన్టీఆర్ ప్రచారం చేసినా ఫలితం దక్కలేదనే ప్రచారం కూడా ముమ్మరంగానే సాగింది. అయినా, ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరమేమీ కాలేదు. కానీ ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది.

నారా లోకేష్ ప్రవేశంతో తారుమారు..
చంద్రబాబు తనయుడు నారా లోకేష్ టిడిపిలో ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధం కావడంతో విభేదాలు పొడసూపడం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా లోకేష్ ఫ్లెక్సీలు పెట్టడాన్ని హరికృష్ణ వ్యతిరేకించారని అంటారు. ఇదే హరికృష్ణకు, చంద్రబాబుకు మధ్య విభేదాలకు కారణమైందని కూడా అంటారు. నారా లోకేష్‌ను తన వారసుడిగా చంద్రబాబు ముందుకు తేవడాన్ని జీర్ణించుకోలేని జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణతో కలిసి అసమ్మతి రాజకీయాలు నడిపారనే ప్రచారం కూడా ఉంది. క్రమంగా వారిద్దరిని చంద్రబాబు దూరం జరుపుతూ వచ్చారు. చివరకు పార్టీలో వారికి దాదాపుగా స్థానం లేకుండా చేశారు.

బాలయ్యతో హరికృష్ణకు కౌంటర్
బాలకృష్ణ కూతురు బ్రాహ్మణికి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌ను ఇచ్చి వివాహం చేశారు. దీంతో చంద్రబాబుకు, బాలకృష్ణకు మధ్య బంధం బలపడింది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమవుతున్న క్రమంలోనే బాలకృష్ణ దగ్గరవుతూ వచ్చారు. బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు. దాంతో ఎన్టీఆర్ కటుుంబ సభ్యుల నుంచి చంద్రబాబుకు మరొకరు అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడానికి హరికృష్ణకు ఆటంకం కూడా ఏర్పడింది.

జూ.ఎన్టీఆర్ వర్సెస్ బాలకృష్ణ
తాత ఎన్టీ రామారావు వారసుడిగా ముందుకు రావడానికి జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగానే ప్రయత్నించారని అంటారు. సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ఆయన తీవ్రంగా కృషి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ దూకుడు బాలయ్యకు రుచించడం లేదని అంటారు. అంతేకాకుండా కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడం కూడా ఇరువురి మధ్య ఎడం పెరగడానికి కారణమైందని అంటారు. కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ పట్టుబట్టి టికెట్ ఇప్పించుకున్నారని అంటారు. కొడాలి నాని టిడిపిని వీడి, వైసిపిలో చేరిన తర్వాత చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం జూనియర్ ఎన్టీఆర్‌పై కూడా పడింది. దాంతో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరికి తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడలేదని సమాచారం.

బాలయ్యతో చంద్రబాబుకు ఇబ్బంది లేదు...
రాజకీయాల్లో బాలకృష్ణకు స్థానం కల్పించినప్పటికీ, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబుకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించబోరని సమాచారం. ఎమ్మెల్యేగా ఉంటూ కూడా బాలయ్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆయన సినిమాలకు స్వస్తి చెప్పి టిడిపి వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకునే పరిస్థితిలో లేరు. అంతే కాకుండా, ఆయనకు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్లు లేదు. దీంతో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను తన వారసుడిగా ముందుకు తేవడానికి ఏ విధమైన ఇబ్బందీ కలగడం లేదు.

నారా లోకేష్ ఆధిపత్యం ఇలా...
నందమూరి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కన పెట్టిన తర్వాతనే నారా లోకేష్‌కు పూర్తిగా టిడిపిపై పట్టు సాధించదడానికి వీలైంది. చంద్రబాబు తర్వాత నారా లోకేషే అనే అభిప్రాయం టిడిపిలో వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేయకుండా కొనసాగనిచ్చి ఉంటే నారా లోకేష్‌కు పట్టు సాధ్యమయ్యేది కాదని అంటున్నారు. చంద్రబాబు వ్యూహాత్మకంగానే అలా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

కల్యాణ్ రామ్ చాలా ప్రయత్నించినా...
హరికృష్ణ తనయుడు, హీరో కల్యాణ్ రామ్ సయోధ్యకు ప్రయత్నించారని అంటారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ టిడిపి మహానాడుకు దూరమైనప్పటికీ ఆయన హాజరయ్యారు. బాలకృష్ణతో జూనియర్ ఎన్టీఆర్‌ను, హరికృష్ణను కలిపేందుకు, చంద్రబాబుతో సయోధ్యను సాధించేందుకు ఆయన చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని అంటున్నారు. ఇప్పుడు ఆయన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ శిబిరంలోనే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఆయన బంధం మరింతగా బలపడింది. మరో నందమూరి నటుడు తారకరత్న కూడా టిడిపికి దగ్గర కావడానికి ప్రయత్నించారు. కానీ అది కూడా ఫలించినట్లు లేదు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications