రేవంత్ ఇష్యూ: ఆధునిక టెక్నాలజీ, రిమెట్ కెమెరాలు వాడారు
హైదరాబాద్: రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ అధికారులు ఇటీవల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకొన్నారు. వీటిలో రిమోట్‌తో ఆపరేట్ చేయగలిగే రహస్య కెమెరాలూ ఉన్నాయి.
సంప్రదింపులు జరిపేందుకు మొదటిసారి రేవంత్.. ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ బంధువు మార్క్ టేలర్ ఇంటికి వచ్చినప్పుడు మామూలు కెమెరా ఒక్కటే వాడారు.
ఇందులో దృశ్యాలు, సంభాషణలు అంత స్పష్టంగా లేవు. దీంతో రేవంత్ రెడ్డి వస్తే అతనిని ఎక్కడ కూర్చోబెట్టాలో ముందుగానే రెక్కీ నిర్వహించి, తదనుగుణంగా కెమెరా ఏర్పాటుచేశారు. తర్వాత రోజు ఆదివారం డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం ఆధునిక కెమెరాలు వాడారు.

కచ్చితంగా డబ్బు సంచి, వాటిని ఇచ్చే దృశ్యాలు కూడా నమోదు కావాలి. ఏదైనా పరిస్థితుల్లో తాము అనుకున్నట్లు కాకుండా వేరే ప్రాంతంలో రేవంత్ రెడ్డి కూర్చున్నప్పటికీ కెమెరాకు చిక్కేలా ఏర్పాటు చేసుకొన్నారు. ఇందుకోసం రిమోట్ కెమెరా వాడారు.
దీన్ని రేవంత్ రెడ్డికి కుడివైపు సోఫా వద్ద అమర్చారు. ఇందులో నమోదయ్యే దృశ్యాలు పక్క గదిలో ఉన్న తెరపై కనిపిస్తుంటాయి. ఆ దృశ్యాలను బట్టి అక్కడ పని చేస్తున్న నిపుణుడు తన చేతిలో ఉన్న రిమోట్‌తో కెమెరా కోణాన్ని కావాల్సిన విధంగా తిప్పుకోవచ్చు.
ఆదివారం రికార్డు చేసిన దృశ్యాల్లో మొదట రేవంత్ రెడ్డి మొహం సరిగా కనిపించలేదు. వెంటనే సరిదిద్ది మొహంపై ఫోకస్ అయ్యేలా కెమెరా కోణాన్ని రిమోట్‌తో మార్చగలిగారు. ముందు గదిలో సంభాషణ జరుగుతుంటే వెనుక గదిలో ఎసీబీ అధికారులతోపాటు నిపుణుల బృందం మకాం వేసింది. స్టీపెన్ ఇంట్లో కెమెరాలు కూడా ఎక్కువగానే పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications