మెట్రో బండారం బయటపడుతుందనే: కేసీఆర్‌పై రేవంత్
హైదరాబాద్: మెట్రో భూములలో వందల కోట్ల అక్రమాలు జరిగాయని, దీని పైన శాసన సభలో చర్చకు అనుమతించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. ఆయన సభాపతి మధుసూదనా చారిని కలిశారు. మెట్రో భూముల పైన చర్చకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తుందని చెప్పారు. అనంతరం శాసన సభ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు.
మెట్రో భూముల పైన సభా కమిటినీ నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందులో ప్రభుత్వం నచ్చిన వారిని పెట్టుకోవచ్చునని, తనను కూడా తీసుకోవాలన్నారు. మెట్రో భూముల్లో రూ.300 కోట్ల నష్టం జరిగినట్లుగా అధికారిక అంచనా, అనధికారికాంగా రూ.1000 కోట్ల నష్టం జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు.

ఈ మొత్తం రామేశ్వర రావు ఖజనాకు వెళ్లిందని అంటున్నారన్నారు. రామేశ్వర రావుకు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు చిత్తశుద్ధి ఉంటే, తాము నిజాయితీగా పని చేస్తున్నామనుకుంటే.. దానిని సభలో నిరూపించుకోవాలన్నారు. మెట్రో వ్యవహారం పైన సభా కమిటీ వేయాలన్నారు. సభలో కావాలనే ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందన్నారు.
తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. తాను ఎక్కడనా విచారణకు సిద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. భూ బదలాయింపులో ప్రభుత్వం బండారం బయటపడుతుందని ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. తన వద్ద ఉన్న ఆధారాల కాపీని విలేకరులకు ఇస్తానని చెప్పారు.
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: డాక్టర్ కే లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తోందని భాతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ శాసన సభ మీడియా పాయింట్ వద్ద అన్నారు. తెరాసకు మెజార్టీ వచ్చాక కూడా ఇంకా వలసలను ప్రోత్సహించడం ఎంత వరకు నైతికత అని ప్రశ్నించారు. కాగా, అంతకముందు అసెంబ్లీ మంగళవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications