వివాహితను రేప్ చేయబోయి చంపేశాడు: మర్మాంగాన్ని నలిపేసి....

Posted By:
Subscribe to Oneindia Telugu

చిత్తూరు: తన భార్యపై అత్యాచారానికి ప్రయత్నించి హతమార్చిన వ్యక్తిని కక్ష గట్టి అందరూ చూస్తుండగా చంపేశాడు. గ్రామస్థులందరూ చూస్తుండగా రాళ్లు, కర్రలతో మోది చంపేశాడు. రెండేళ్ల క్రితం వివాహితపై అత్యాచారయత్నానికి పాల్పడి హతమార్చిన సంఘటనలో నిందితుడు గ్రామానికి వచ్చాడు.

దాంతో తీవ్రమైన కోపంతో హతురాలి భర్త, మరో ఇద్దరి బంధువులతో కలసి పట్టపగలు గ్రామస్తులు చూస్తుండగానే నిందితుడిని చంపేసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ హత్యకు ముందు రోజు కోర్టు వాయిదాకు హాజరైన నిందితుడు తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని విన్నవించుకున్నాడు.

అతను ఆ విజ్ఞప్తి చేసిన 24గంటల్లోనే హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా పీలేరు మండలం జాండ్ల పంచాయతీ బసిరెడ్డిగారిపల్లెతాండాలో శుక్రవారం ఉదయం జరిగింది. సీఐ నాగరాజు ఈ సంఘటన వివరాలను, నేపథ్యాన్ని వివరించారు.

ఇలా వివాహితను చంపేశాడు

ఇలా వివాహితను చంపేశాడు

బసిరెడ్డిగారిపల్లె తాండాకు చెందిన మూడే రెడ్డి నాయక్‌ (28) 2015 సెప్టెంబరులో అదే గ్రామా నికి చెందిన రాజేంద్రనాయక్‌ భార్య రెడ్డెమ్మపై గ్రామ శివారులోని మామిడితోటలో అత్యాచార యత్నానికి పాల్పడి ఆమెను చంపేశాడు.అప్పట్లో పోలీసులు రెడ్డినాయక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 2016 జనవరిలో అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే స్వగ్రామానికి రాకుండా రెడ్డినాయక్‌ అప్పటి నుంచి కలకడ మండలం ఎనుగొండపాళెం దిగవతాండాలోని తన అత్తగారింట ఉంటూ పీలేరు కోర్టు వాయిదాలకు హాజరవుతూ వస్తున్నాడు.

Facebook Friend Murder Hyderabad | ఫేస్‌బుక్‌ ఫ్రెండే హంతకుడు - Oneindia Telugu
 గురువారం కోర్టుకు హాజరు...

గురువారం కోర్టుకు హాజరు...

గురువారం కోర్టు మూడేెడ్డి నాయక్ వాయిదాకు హాజరయ్యాడు. దాదాపు ఏడాదిన్నర క్రితం నుంచి అత్తగారింట ఉంటున్న అతను స్వగ్రామానికి వెళ్లాలని అనుకున్నాడు. దాంతో తనకు ప్రాణభయం ఉందని, తనకు రక్షణ కల్పించాలని న్యాయమూర్తిని కోరాడు. దీంతో న్యాయమూర్తి పోలీసులను కలవాల్సిందిగా రెడ్డినాయక్‌కు సూచించారు.

ఆ తర్వాత ఇదే రావడం...

ఆ తర్వాత ఇదే రావడం...

వివాహిత రెడ్డెమ్మను హత్య చేసిన తరువాత మొదటిసారి రెడ్డినాయక్‌ గురువారం సాయంత్రం భార్యబిడ్డలతో కలిసి బసిరెడ్డిగారిపల్లెతాండాకు వచ్చాడు. దీంతో తన భార్యను చంపిన రెడ్డినాయక్‌ గ్రామానికి రావడంతో భర్త రాజేంద్రనాయక్‌ ఆగ్రహంతో రగిలిపోయాడు. తన తమ్ముడు బాలకృష్ణనాయక్‌, బావమరిది కిషోర్‌తో కలిసి శుక్రవారం ఉదయం 9.10గంటల ప్రాంతంలో రెడ్డినాయక్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంటి ముంగిట భార్య ధనలక్ష్మితో కలిసి కూర్చొని ఉన్న రెడ్డినాయక్‌ను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

మర్మాంగాన్ని నలిపేసి...

మర్మాంగాన్ని నలిపేసి...

దాడితో రెడ్డినాయక్‌ కేకలు వేయడంతో అతని మర్మాంగాన్ని నలిపేసి హతమార్చారు. ఈ సంఘటనను గ్రామస్థులు చూస్తూ ఉండిపోయారు. అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు. భార్య ధనలక్ష్మి అడ్డువచ్చినా ఆమెను పక్కకు నెట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రెడ్డినాయక్‌ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వద్దని చెప్పినా వినకుండా...

వద్దని చెప్పినా వినకుండా...

న్యాయమూర్తి సూచన మేరకు రెడ్డి నాయక్ పోలీసులను ఆశ్రయించి పరిస్థితిని వివరించాడు. సీఐ నాగరాజు రెడ్డినాయక్‌ను బసిరెడ్డిగారిపల్లె తాండాకు వెళ్లవద్దని, తాను రాజేంద్రనాయక్‌ను పిలిచి మాట్లాడి సర్ది చెప్పిన తరువాత వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. అయితే రెడ్డినాయక్‌ పోలీసుల మాటలను తేలికగా తీసుకుని గ్రామానికి వెళ్లాడు. ఆ మర్నాడే హత్యకు గురయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mudereddy Naik has been killed by his enimy at Peeleru in Chittoor district of Andhra Pradesh.
Please Wait while comments are loading...