కొత్త జిల్లాల వివాదాలు ముగిసేనా - అభ్యంతరాలపై చర్చ : ఎన్టీఆర్ పేరు - జిల్లాల వారీగా..!!
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 కు పెంచాలని నిర్ణయించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తూ ప్రతిపాదిత నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇక, వీటి పైన కొన్ని ప్రాంతాల్లో అభ్యంతరాలు వస్తున్నాయి. మరి కొన్ని చోట్ల నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వానికి భారీ సంఖ్యలో సూచనలు..సలహాలు అందాయి. ఎలాగైనా ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అందులో భాగంగా ఈ రోజు నుంచి కీలక సమావేశాలు జరగనున్నాయి. కొత్త జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు, సలహాలు, సూచనలపై సమీక్షా సమావేశాల్లో చర్చించి ప్రభుత్వానికి కీలక సూచనలు చేయనున్నాయి.

జిల్లాల వారీగా సమీక్షలు
ఇప్పటి వరకు కొత్త జిల్లాల పైన 1,478 అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చినట్లు నివేదిక అందింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 700, తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో 16 విజ్ఞప్తులు అందాయి. అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 3 దాకా గడువున్నా.. ముందుగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. వినతులు ఇచ్చిన వారిలో ప్రజాప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ప్రజాసంఘాల వారు ఉన్నారు.
13 జిల్లాల కలెక్టర్లతో బుధవారం నుంచి ఈ నెల 28 మధ్య 4 రోజులు విజయవాడ, తిరుపతి, అనంతపురం, విశాఖపట్నం నగరాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. 23న విజయవాడలో... కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లతో, 24న తిరుపతిలో... చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో, 26న అనంతపురంలో... అనంతపురం, కర్నూలు జిల్లాల కలెక్టర్లతో, 28న విశాఖపట్నంలో... విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు ఉంటాయి.

ఎన్టీఆర్ జిల్లా పై ఏం చేయనున్నారు
ఇప్పటి వరకు అందిన వాటిలో కృష్ణా జిల్లాలో 37 అభ్యర్థనలు అందాయి. గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని, అవనిగడ్డ, కంకిపాడు, మైలవరం మండలాలను రెవెన్యూ డివిజన్‌లుగా చేయాలని కోరారు. విజయవాడకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని.. ఇప్పటికే విజయవాడకు పెట్టిన ఎన్టీఆర్ పేరును కృష్ణా జిల్లాకు మార్చాలని కోరుతున్నారు.
గురజాలను పల్నాడు జిల్లా కేంద్రం చేయాలని, జాషువా పేరునూ జత చేయాలనే విన్నపంతో వందల సంఖ్యలో అర్జీలొచ్చాయి. బాపట్ల జిల్లాకు భావపురి పేరు పెట్టాలని కోరారు. పెదకూరపాడు-సత్తెనపల్లి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలంటూ వినతిపత్రాలిచ్చారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 150 వినతులు అందాయి. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపకుండా... ఒంగోలు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నాయి.

సీమలో ఆ రెండు జిల్లాలపైనా
మార్కాపురాన్ని ప్రత్యేకంగా జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం సాగుతోంది. హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ..అనంతపురం జిల్లాలో 700 వరకు విజ్ఞప్తులొచ్చాయి. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ 350 విజ్ఞప్తులు అందాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని 330 వినతులొచ్చాయి.
పెనుకొండను జిల్లా కేంద్రం చేయాలని 3, రామగిరి మండల కేంద్రాన్ని అనంతపురం డివిజన్‌లో కలపాలని వినతులు ప్రభుత్వానికి చేరాయి. మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలిచిత్తూరు జిల్లాలో 148 అభ్యంతరాలొచ్చాయి. మదనపల్లె జిల్లాను ఎక్కువ మంది కోరుతున్నారు. పీలేరు, మదనపల్లె, పుంగనూరు, తంబళ్లపల్లెను కలిపి కొత్త జిల్లాగా ప్రకటించాలని, శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్ చేయాలని, నగరి నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో, గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండలాన్ని బాలాజీ జిల్లాలో కలపాలంటూ ఎక్కువగా ప్రజాప్రతినిధుల నుంచే విజ్ఞప్తులు వచ్చాయి.

సీమక్షలు.. నివేదికలే ఆధారంగా
రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలనేవే ఎక్కువ వినతులు కడపలో వస్తున్నాయి. కాకినాడ జిల్లాకు పిఠాపురం మహారాజా, మల్లాడి సత్యలింగనాయకర్, అన్నవరం సత్యనారాయణ స్వామి పేరు పెట్టాలని, అమలాపురం జిల్లాకు కోనసీమ, అంబేడ్కర్, డొక్కా సీతమ్మ, జీఎంసీ బాలయోగి, సర్‌ఆర్థర్ కాటన్ పేర్లు.. రాజమహేంద్రవరం జిల్లాకు పుష్కర గోదావరి, సర్‌ఆర్థర్ కాటన్, కందుకూరి వీరేశలింగం పంతులు పేర్లు పెట్టాలని వినతులు ప్రభుత్వానికి చేరాయి.
అరకు కేంద్రంగా అల్లూరి జిల్లాను ఏర్పాటుచేయాలని, రంపచోడవరాన్ని అల్లూరి జిల్లాలో కలపొద్దని, మైదాన ప్రాంతంలోని షెడ్యూల్ ప్రాంతాలను అల్లూరి జిల్లాలో కలపాలని డిమాండ్లున్నాయి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications